9న ఏమైపోయావే.. పాట విడుదల

బేబీ సాన్విక సమర్పణలో వస్తున్న ”ఏమైపోయావే.. ఏమైపోయావే..” లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ప్రోమో ఇటీవల విడుదలై సంగీత ప్రేమికులను అలరిస్తోంది. సాన్విక మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదలైన ఈ పాట జనరంజకంగా ఉందని పలువురు ప్రముఖులు అంటున్నారు.
మౌనశ్రీ మల్లిక్ రాసిన ఈ అద్భుత ఈ గీతాన్ని దిలీప్ దేవగన్ గొప్పగా పాడారు. రిషి కమల్ సంగీతం వినసొంపుగా ఉంది. ఈ పాటకు చాయాగ్రహణం నరసింహాచారి, ఎడిటింగ్ సంపత్, నిర్మాతలు వెంకట్ యాదవ్, ఉపేందర్ యాదవ్, దర్శకత్వం శ్యామ్ క్యాషియో.

అక్టోబర్ 2న విడుదలైన ఈ పాట ప్రోమోకు ప్రశంసలు వెల్లువలా వస్తున్నట్టు సమాచారం. పూర్తి పాట అక్టోబర్ 9న ఉదయం 7:30 గంటలకు విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*