
ఏనుగుపై పద్మాసనం.. ఆపై భ్రమరి ప్రాణాయాయం.. కింద పడిపోయిన బాబా రాందేవ్
మథుర: ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఏనుగుపై నుంచి కిందపడిపోయారు. మథురలో కొందరికి యోగా నేర్పించేందుకు ఆయన ఏనుగు ఎక్కారు. పద్మాసనం వేశారు. ఆ తర్వాత చెవులు, కనులు మూసుకుని భ్రమరి ప్రాణాయామం చేస్తుండగా ఏనుగుకు షాక్ కొట్టినట్లైంది. కొద్దిగా కదలడంతో బ్యాలన్స్ అవుటై ఆయన కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన మావటి ఏనుగును అదుపు చేశాడు. బాబా రాందేవ్ కింద పడిపోగానే ఆయన సహాయకులు, కార్యక్రమ నిర్వాహకులు రాందేవ్‌ను పట్టుకున్నారు. ఆ తర్వాత బాబా రాందేవ్ కూల్‌గా నడచుకుంటూ వెళ్లిపోయారు. మళ్లీ ఏనుగు ఎక్కలేదు. రాందేవ్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
Be the first to comment