హోం ‌క్వారంటైన్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే ఐదు రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవిత కలిసిన ‌జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌‌గా‌ నిర్దారణ కావడంతో, ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఐదు రోజులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుబాటులో ఉండటం లేదు.


అంతకు ముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంత్రులు, నేతలు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు అభినందనలు తెలిపారు.

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్ఎల్‌సీ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో విజయం సాధించి శాసనమండలిలో అడుగుపెడుతున్న కల్వకుంట్ల కవితకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు వి.మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి పి. రవీందర్ కుమార్, హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎమ్.‌బి కృష్ణా యాదవ్, కేంద్ర కార్యదర్శి బి.వెంకటయ్య తదితర నాయకులు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కవిత మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

అంతకు ముందు కవితను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిబిజికేఎస్, పీఆర్టీయూ నేతలు కలిసి‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

మంత్రులు పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ కవితను కలిసి అభినందనలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, నిజామాబాద్ జిల్లా ప్రజల్లో కవితపై ఉన్న ఆదరణ ఇంతటి ఘన విజయాన్ని అందించాయని మంత్రులు తెలిపారు.

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ప్రభుత్వ విప్‌లు గొంగడి సునీత, అరికెపూడి ‌గాంధీ, ఎమ్మెల్యేలు ‌జోగు రామన్న, దాసరి మనోహర్ రెడ్డి, ఛల్లా ధర్మారెడ్డి, కల్వకుంట్ల విద్యా సాగర్ రావు, వనామ వెంకటేశ్వరరావు, అబ్రహం, బండ్ల‌ కృష్ణ మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, సుంకె రవిశంకర్, జోగు రామన్న ఎమ్మెల్సీ కవిత గారికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ కే.జనార్థన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పీఆర్టీయూ నాయకులు పూల రవీందర్, టిబిజికేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ కవితను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*