
హైదరాబాద్: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు వేల ఆవులను కాపాడాడు. అక్షరాలా నిజం. తెలంగాణ, మేడ్చల్ జిల్లా పర్వతపురం శ్రీకృష్ణ దత్త గోశాలకు చెందిన బండారు పవన్ రెడ్డి ఐదు వేలకు పైగా ఆవులను కాపాడాడు. 2010నుంచి గోమాతలను కాపాడటం ప్రారంభించాడు.
2014 సెప్టెంబర్ 15న గోశాల ప్రారంభించాడు.
మూగజీవుల ప్రాణాలు కాపాడటంలో ముందుండే పవన్‌కు గోమాతలంటే భక్తి. గోవు తల్లి వంటిదంటోన్న పవన్ గోమాతల సేవలో తరిస్తున్నాడు. ఆధ్యాత్మిక మార్గంతో పాటు ప్రకృతికి కూడా గోవు చాలా అవసరమనే పవన్ గో సేవలో తనకు ఆనందం లభిస్తుందని గర్వంగా చెబుతున్నాడు. గోవును రక్షించుకుంటే ప్రకృతి వైపరీత్యాలు నుంచి కాపాడబడతామని, గోవును రక్షించుకుంటే మన సమాజం, రాష్ట్రం, దేశం, ప్రపంచం బాగుంటుందని చెబుతున్నాడు.
గో సంరక్షణ కోసం ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదని పవన్ చెబుతున్నాడు. గోరక్షణ చట్టం వచ్చినా గోరక్షకులపై అక్రమ కేసులు పెట్టడం, బెదిరించడం, జైల్లో పెట్టడం జరుగుతునే ఉన్నాయని పవన్ అంటున్నాడు. గోరక్షణ ప్రతి భారతీయుడి విధి అని చెబుతోన్న పవన్ గోసేవలో తరించాలని సూచిస్తున్నాడు.
మనం కూడా పవన్‌ను ఆదర్శంగా తీసుకుని గోమాతలను కాపాడే బాధ్యత తీసుకుందామా? ప్రకృతి మాతను కాపాడుకుందామా? గో సేవలో తరిద్దామా?
Be the first to comment