కళాపోషకులు’ టీజ‌ర్ విడుద‌ల‌..

‘కళాపోషకులు’ టీజ‌ర్ విడుద‌ల‌..

 

విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరోహీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై చలపతి పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో ఏమ్. సుధాకర్ రెడ్డి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ‘కళాపోషకులు’. న‌టుడు జెమిని సురేష్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఈ రోజు హైదారాబాద్ ఫిలిం ఛాంబ‌ర్ లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఈ మూవీ టీజ‌ర్ ను మీడియా త‌రుపున సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప్రభు విడుద‌ల‌చేసి చిత్ర విజ‌యాన్నిఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో..

ద‌ర్శ‌కుడు చలపతి పువ్వల మాట్లాడుతూ – ‘‘ముందుగా న‌న్ను నమ్మి ఈ అవ‌కాశం ఇచ్చిన మా నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి ధ‌న్య‌వాదాలు. సుధాకర్ రెడ్డి గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించ‌డం వ‌ల్లే ఔట్‌పుట్ ఇంత‌బాగా వ‌చ్చింది. ఆ నలుగురు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. మొద‌టి సినిమా అయినా చాలా బాగా న‌టించారు. లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది.’ అని అన్నారు.

నిర్మాత ఏమ్. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘మీడియా వారి చేతుల మీదుగా మా సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల‌చేయ‌డం హ్యాపీగా ఉంది. ఈ క‌థకి హీరోగా విశ్వకార్తికేయ ప‌ర్‌ఫెక్ట్ చాయిస్‌. దర్శకుడు చలపతి పువ్వల ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. కల్యాణ్ సమి కెమెరా వర్క్, ఎలెందర్ మహావీర్ మ్యూజిక్ సినిమాకు అదనవు ఆకర్షణలు కానున్నాయి. ఈ సినిమా త‌ప్ప‌కుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండబోతోంది. మీ అంద‌రి స‌పోర్ట్ కావాలి`’ అన్నారు.

 

హీరో విశ్వకార్తికేయ మాట్లాడుతూ – “ఈ మూవీ ఒక టీమ్ వ‌ర్క్‌, ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ సపోర్ట్‌తోనే మంచి ఔట్‌పుట్ సాధ్యం అయింది. నిర్మాత ఏమ్. సుధాకర్ రెడ్డి గారు ముందుండి మాకు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూసుకున్నారు. చ‌ల‌ప‌తి గారు ఈ క‌థ న‌రేట్ చేస్తున్న‌ప్పుడే బాగా న‌చ్చి ఈ సినిమా చేయ‌డం జ‌రిగింది. మేమంద‌రం ఎంతో ఇష్టంగా క‌ష్ట‌ప‌డి చేసిన `క‌ళాపోష‌కులు` చిత్రానికి మీ అంద‌రి ఆశిర్వాదాలు ఉండాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

 

ఈ కార్య‌క్ర‌మంలో న‌టులు జెమిని సురేష్, జ్వాలా చ‌క్ర‌వ‌ర్తి, చైతన్య, లిరిసిస్ట్ రాంబాబు గోసాల‌, సంతోష్‌, మ‌హేష్‌, రాణి త‌దిత‌రులు పాల్గొని ప్ర‌సంగించారు.

 

బ్యానర్: శ్రీ వెన్నెల క్రియేషన్స్

నటీనటులు: విశ్వకార్తికేయ, దీప ఉమాపతి, భాష, చైతన్య, చిన్ను

కెమెరామెన్: కళ్యాణ్ సమి

ఎడిటర్: సెల్వ కుమార్

సంగీతం: ఎలేందర్ మహావీర్

పీఆర్ఓ: సాయి సతీష్

నిర్మాత, స్టొరీ: సుధాకర్ రెడ్డి.ఎమ్

స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: చలపతి పువ్వల.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*