రాధేశ్యామ్ చిత్రంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పోషించిన విక్ర‌మాధిత్య క్యారెక్ట‌ర్ లుక్ విడుద‌ల‌

  • రాధేశ్యామ్ చిత్రంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పోషించిన విక్ర‌మాధిత్య క్యారెక్ట‌ర్ లుక్ విడుద‌ల‌

 

ప్ర‌భాస్ అభిమానులు కోసం ఈ లుక్ ని విడుద‌ల చేసిన నిర్మాణ సంస్థ‌లు గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్

 

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులకి స్పెష‌ల్ ట్రీట్ ఇస్తూ, రాధేశ్యామ్ చిత్ర నిర్మాణ సంస్థ‌లు గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ వారు ఈ చిత్రంలో రెబల్ స్టార్ పోషిస్తున్న విక్ర‌మాధిత్య రోల్ కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు. అక్టోబ‌ర్ 23న రెబల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అనే మోష‌న్ పోస్టర్ ని విడుద‌ల చేయ‌బోతున్న చిత్ర బృంతం కొంచెం ముందుగానే ప్ర‌భాస్ కి అడ్వాన్స్ హ్య‌పీ బ‌ర్త్ డే విషెస్ చెబుతూ ఈ లుక్ ని విడుద‌ల చేయ‌డం విశేషం. ప్ర‌తి సినిమాకి త‌న హ్యాండ్ స‌మ్ లుక్స్, స్టైలిష్ మేకోవ‌ర్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసే రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, ఇప్పుడు రాధేశ్యామ్ లో కూడా అల్ట్రా స్టైలిష్ గా క‌నిపించ‌బోతున్నారనే విష‌యం ఈ లుక్ చూస్తే అర్ధ‌మైపోతుంది. ఇటలీలో ఉన్న గ్రీకు క‌ట్టడాలు బ్రాక్ డ్రాప్ లో వింటేజ్ కార్ మీద బ్లూ బెజ‌ర్ వేసుకుని స్టైలిష్ గా కుర్చున్న ప్ర‌భాస్ లుక్ అభిమానుల్లో రాధేశ్యామ్ చిత్రం పై మ‌రింత‌గా అంచ‌నాలు పెంచేలా ఉంది. ఇక బాహుబలి1, బాహుబ‌లి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న “రెబ‌ల్‌స్టార్” ప్ర‌భాస్ 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. “రెబ‌ల్‌స్టార్” ప్ర‌భాస్ స‌ర‌స‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని “రెబ‌ల్‌స్టార్” డాక్టర్ యూ.వి.కృష్ణంరాజు గారు స‌మ‌ర్పించ‌గా, వంశీ, ప్ర‌మెద్‌, ప్రసీధ‌‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్నో సూప‌ర్‌హిట్స్ అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యూవి క్రియెష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్ కి సంగీత‌ దర్శ‌కునిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం ఇట‌లిలో షూటింగ్ జ‌రుపుకుంటోంది.  తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో రాధేశ్యామ్ ను విడుద‌ల చేయడానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

 

నటీనటులు:

 

ప్రభాస్, పూజా హెగ్డే, స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జి, ముర‌ళి శ‌ర్మ‌, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యాన్ త‌దిత‌రులు

 

సాంకేతిక నిపుణులు:

 

చిత్ర స‌మ‌ర్ప‌కులు : “రెబ‌ల్‌స్టార్” డాక్ట‌ర్ యు వి కృష్ణంరాజుసినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంసఎడిటర్ :  కొటగిరి వెంక‌టేశ్వ‌రావుయాక్ష‌న్‌, స్టంట్స్‌ : నిక్ ప‌వ‌ల్‌మ్యూజిక్ :  జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్సౌండ్ డిజైన్ : ర‌సూల్ పూకుట్టికొరియోగ్ర‌ఫి : వైభ‌వి మ‌ర్చంట్‌కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌ : తోట విజ‌య భాస్క‌ర్ అండ్ ఎకా ల‌ఖానివి ఎఫ్ ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్‌ : క‌మ‌ల్ క‌న్న‌న్‌ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ : ఎన్‌.సందీప్‌హెయిర్‌స్టైల్‌‌ : రోహ‌న్ జ‌గ్ట‌ప్‌మేక‌ప్‌ : త‌ర‌న్నుమ్ ఖాన్స్టిల్స్‌ : సుద‌ర్శ‌న్ బాలాజిప‌బ్లిసిటి డిజైన‌ర్‌ : క‌బిలాన్‌పి ఆర్ ఓ : ఏలూరు శ్రీనుకాస్టింగ్ డైర‌క్ట‌ర్‌ : ఆడోర్ ముఖ‌ర్జిప్రోడక్షన్ డిజైనర్ : ర‌‌వీంద‌ర్‌నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్రసీధ‌

దర్శకుడు : రాధాకృష్ణ కుమార్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*