నా త‌మ్ముడు గొండు వీరుడు కొమ‌రం భీం అంటూ గ‌ర్జించిన రామ‌రాజు

నా త‌మ్ముడు గొండు వీరుడు కొమ‌రం భీం అంటూ గ‌ర్జించిన రామ‌రాజు

 

మ‌ల్టిస్టార‌ర్ మూవి ఆర్ ఆర్ ఆర్‌ చిత్రం లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్ టి ఆర్ లు పోటాపోటిగా న‌టిస్తున్నారు అనే దానికి నిదర్శ‌నం విడుద‌ల‌య్యిన రెండు టీజ‌ర్ లు.. మెద‌టి విడుద‌ల చేసిన టీజ‌ర్ లో ఒళ్ళు గుళ్ళ చేసుకునేలా వ్యాయామం చేస్తూ విల్లు ని త‌న సిక్స్ ప్యాక్ బాడి తో ఎక్కుపెట్టిన రామ్‌చ‌ర‌ణ్‌, దానికి ఎన్ టి ఆర్ వాయిస్ అందించి నా అన్న సీతారామ‌రాజు ఇంటి పేరు అల్లూరి అంటూ గ‌ర్జించాడు. ఇప్ప‌డు అదే వూపులో యూనిట్ కొమ‌రం భీం టీజ‌ర్ ని విడుద‌ల చేసారు. దీంట్లో కూడా ఎన్ టి ఆర్ ఏమాత్రం త‌గ్గ‌కుండా త‌నేంటో ప్రూవ్ చేసుకున్నాడు. మెద‌ట వాట‌ర్ లో బ‌ల్లెం ని తీసి త‌న సిక్స్ బాడీ ని ర‌క్త‌పు చుక్క‌ల‌తో చూపించాడు. దీనికి ఇప్ప‌డు రామ్‌చ‌రణ్ వాయిస్ ఇస్తూ

 

 

వాడు క‌న‌బ‌డితే స‌ముద్రాలు త‌డ‌బ‌డ‌తాయ్‌..నిల‌బ‌డితే సామ్రాజ్యాలు సాగిల‌ప‌డ‌తాయ్‌..వాడి పొగ‌రు ఎగిరే జెండా..వాడి ధైర్యం చీక‌ట్ల‌ని చీల్చే మండుటెండ‌..వాడు భూత‌ల్లి చ‌నుపాలు తాగిన మ‌న్యం ముద్దు బిడ్డ‌.. నా త‌మ్ముడు గోండు వీరుడు కొమ‌రం భీం.. అంటూ పిచ్ పెంచుతూ గ‌ర్జించాడు ఇదే ఈ టీజ‌ర్ కి హైలెట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని ఎస్ ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం లో డి వి వి ధాన‌య్య నిర్మిస్తున్నారు. ఈ డెకాడ్ కే ఇది మెస్ట్ క్రేజియ‌స్ట్ ఫిల్మ్ గా 2021 లో విడుద‌ల కి సిద్ద‌మ‌వుతుంది.

 

 

 

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*