
హైదరాబాద్: భారతీయ వ్యవసాయ పద్ధతులపై పరిశోధనలు చేస్తూ వేద వ్యసాయంతో ముందుకెళ్తోన్న కృషి భారతం స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. సెల్ఫీ విత్ వృషభ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రైతులు తమ వృషభాలతో సెల్ఫీ దిగి 8686743452,., 7095778791 నెంబర్లకు పంపడంతో పాటు #selfiewithvrushabha హ్యాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయాలని కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ పిలుపునిచ్చారు. ఎంపికచేసిన కొన్ని సెల్ఫీలను ఈక్షణం వెబ్సైట్లో పబ్లిష్ చేస్తారని తెలిపారు.
భారతీయ గోవులతో పాటు వృషభాలను కాపాడుకుంటేనే దేశంలో వ్యవసాయ రంగం సుభిక్షంగా ఉంటుందని ఆయన అంటున్నారు. కృషి భారతం గతంలో కూడా ఈ కార్యక్రమాన్ని దేశ విదేశాల్లో విజయవంతంగా నిర్వహించింది.
రైతు ఆరోగ్యమే దేశ ఆరోగ్యమని చెబుతోన్న కృషి భారతం దేశవాళీ వృషభాలను కాపాడుకునేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. క్రమం తప్పకుండా వృషభోత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.
krishibharatham.org
Be the first to comment