సెల్ఫీ విత్ వృష‌భ సూపర్ హిట్… సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్న యూత్   

హైద‌రాబాద్: కృషి భార‌తం ప్రారంభించిన సెల్ఫీ విత్ వృష‌భకు అనూహ్య స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి యువ రైతులు తమ వృషభాలతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ పిలుపు మేరకు విదేశాల్లో కూడా యువత తమ వృషభాలతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అంతే కాదు 8686743452,., 7095778791 నెంబ‌ర్‌లకు తమ ఫొటోలను పంపుతున్నారు.

భార‌తీయ వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌పై ప‌రిశోధ‌న‌లు చేస్తూ వేద వ్య‌సాయంతో ముందుకెళ్తోన్న కృషి భార‌తం భార‌తీయ గోవులతో పాటు వృష‌భాల‌ను కాపాడుకోవాలని రైతన్నలకు సూచిస్తోంది. దేశంలో వ్య‌వ‌సాయ రంగం సుభిక్షంగా ఉండాలంటే దేశవాళీ గోవులతో పాటు భారతీయ వృషభాలను కాపాడుకోవాలని కౌటిల్య సూచిస్తున్నారు. కృషి భారతం ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా వృషభోత్సవాలను నిర్వహిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*