ఎందుku? ఏమిti? ఎలాga?.. కృతజ్ఞత (Gratitude).. సైకాలజిస్ట్ స్రవంతి చాగంటి ప్రత్యేక కథనం

Gratitude

ప్రకృతి, పర్యావరణం, ఆర్థిక వనరులు, వయసు, స్థానం, పరిస్థితులు, పరిమితులు, వీటి అవసరం లేకుండా…
ప్రతీ వ్యక్తి లోనూ, పుష్కలంగా సమృద్ధిగా పనిచేసే శక్తి కలదీ, ఉన్నదీ ఏమిటి?
కృతజ్ఞత… అంటే Gratitude…
నిజమైన ఆనందానికి ఆయువు, ప్రాణవాయువు.
కృతజ్ఞత మనకి తెలీకుండా మనలో ఉండే శక్తిని తట్టిలేపి, అడ్డంకులను, పరిమితులను అధిగమించేలా చేస్తుంది.
బంధాలు కానీండి, వస్తువులు కానీండి దేని విలువ అయినా… అనుభవం చెంది అది లేకుండా పోయినపుడో, లేదా అసలు లేనపుడో, లేదా వైఫల్యాలు స్మారక చిహ్నల్లా మన ఎదురుగా మనకే కనిపిస్తున్నప్పుడో కానీ తెలియదు. ఏమి కోల్పోయామో. దురదృష్టవశాత్తు ఉన్నదాని కన్నా, లేని లోటు గురించే ఎక్కువ ఆలోచించే తత్త్వం చిన్నప్పటి నుండే అలవాటు అయిన చాలా శాతం మందికి, జీవితంలో ఏదో మారాలి లేదా మార్పు రావాలి అనుకుంటే కృతజ్ఞత practice చేయడం చాలా శక్తివంతమైన సాధనం. అవును మీరు corrrct గానే చదివారు. Practice చేస్తే తప్ప అలవర్చుకోలేని skill… Gratitude.
అదేమీ పుట్టుకతో రాదు.

ఎందుku?

అసలు కృతజ్ఞతకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇవ్వాలి?
నా దృష్టిలో జీవితం అంటేనే Focus. ఆ focus ఒక్కోసారి వివిధ కారణాల వల్ల అటు ఇటు తప్పిపోడం చాలా సహజం. ట్రాక్ లోకి తీసుకురావాలంటే కృతజ్ఞత/gratitude help తీసుకోడం తప్పనిసరి.
మనిషి అంతర్గత స్థిరత్వానికి (inner sustainability ) అవసరం. ఆ.. స్థిరత్వం ఉన్నప్పుడు వ్యక్తిలో వత్తిడి ఎదుర్కునే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శాంతి, నమ్రత, కారుణ్యం, వంటబడతాయి. దానితో వ్యక్తిలో తనని తానే కాకుండా ఇతరులను కూడా సపోర్ట్ చేసే సామర్ధ్యం వస్తుంది. అది స్వస్థత, సంతోషం, ఏదో సాధించిన feeling తీసుకొస్తుంది.
ఏ ట్రైనింగ్ అవసరం లేనిది, ప్రత్యేకంగా పరికరాలు కొనక్కర్లేదు. రోజులో 5-10నిముషాలు కేటాయిస్తే చాలు.
జీవితాంతం ఆటుపోట్లు తట్టుకుని, భరించి నిలబడగలిగే సత్తా కావాలి అనుకుంటే కృతజ్ఞత సాధన చేయడం ఒక అలవాటుగా చేసుకోగలగాలి.
ఏదో చెప్పో, ఏదో చేసో, చుట్టూ ప్రపంచాన్ని మనం పూర్తిగా ఎప్పుడూ మార్చలేము, కానీ ఏ పరిణామాల (consequences) వల్ల మనలో మార్పు తటస్థించిందో, ఆ మార్పే.. ‘మనం’, మనం చేసుకున్నదే !
మంచో… చెడో.. మనలో ఉండే emotions కు ప్రతిస్పందిచకుండా ఉండలేము. కానీ ఆలోచనా విధానాన్ని మార్చుకుని, emotionsని అయితే influence చేయగలము కదా !
అందుకు Gratitude కి అంత ప్రాముఖ్యత ఇవ్వాలి.

ఏమిti?

కృతజ్ఞతతో ఉండడం అంటే ఏమిటి?
ప్రాధమికంగా 3 విషయాలను చాలా consciousగా మార్చుకోవడం.
1. మీ గతం (past)
2. మీ వర్తమానం (present)
3. మీ భవిష్యత్. (future)
గతం : మీ బంధాల, అనుభవాలు మధ్యలో ఉన్న దూరమెంత, దాన్ని ఎలా తగ్గించుకోగలరు? దానికి చేయవల్సిన మానసిక కసరత్తులు.
Past కి మనం బానిసలుగా అవక్కర్లేదు, ఆ pastని ఆధారంగా తీసుకుని, జీవనాన్ని ఆసక్తిగా, ప్రేరణగా మార్చుకుని ఎలా ముందుకు సాగవచ్చు? అన్నమాట.
వర్తమానం : అందరికి చాలా అరుదుగా ఆదర్శవంతమైన పరిస్థితులు ఉంటాయి. మిగతా అప్పుడంతా సవాళ్లు, friction ఎక్కువ. so, మనకుండే వనరుల మీద ఆధారపడుతున్నామా, లేదా మన మీద మనం ఆధార పడుతున్నామా అన్నది ఇక్కడ విష్యం.
వనరులు మీద అయితే ‘గతం తాలూకు Gap’ లో ఇరుక్కున్నారని, మనమీద మనం అయితే, ‘భవిష్యత్ లో కలిగే ప్రయోజనం’ గురించి ఆలోచిస్తూ, మీ జీవితాన్ని మీరు పునః సృష్టించుకోడానికి సిద్ధంగా ఉన్నారనీ .
భవిష్యత్తు : Past, present తో తెచ్చుకున్న మార్పుతో visualization చేస్తూ ప్రశించుకోడం.
*ఎలాంటి experiences కావాలని అనుకుంటున్నారు?
* దానికి ఎలాంటి సంఘటనలు జరిగితే బాగుంటుంది?
* దానికి కావాల్సినట్టుగా steps తీసుకుంటున్నారా?
* ఈ process లో మీ కలలు నిజమవడానికి తగినంత relaxed స్టేట్ లో ఉండగలుగుతున్నారా? లాంటివి.

ఎలాga?

Gratitudeని ఎలా పోషించి, ఆదరించి పెంపొందించుకోవాలి?
* Emotional Tune-up. ఒక నచ్చని పాట రేడియో లేదా tv లో వస్తుంటే, వెంటనే ఎలా మార్చేస్తామో అలాగే ఒక emotion బాధపెడుతుంటే, తాత్కాలికంగా దాన్నుండి దూరం జరగడం ద్వారా!
* దేని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారో ప్రతిరోజూ పొద్దున్న 3, సాయంత్రం 2 విషయాలు pointలా రాయడం. వారం తిరిగేసరికి అనవసరం అయినవి
తీసేసి ఒక సారాంశంలా 2 లైన్స్ కు కుదించుకోడం. ఇది ఒక అలవాటు గా మార్చుకున్నప్పుడు, ఒక ఆరునెలల తర్వాత జీవితంలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది.
* అలాగే thankful కి grateful మధ్య సున్నితమైన తేడా తెలుసుకోడం. Thankful అంటే అంతర్గతం, grateful అంటే బయట నుండి ఎవరైనా సహాయం చేసినపుడు కలిగేది.. express చేసేది.. చేయవలసింది. ఈ తేడా తెలుసుకోడం Gratitude practice కి చాలా అవసరం.
చాలా సందర్భాల్లో అందరం కృతజ్ఞతా భావ బాధితులం, బానిసలం అయిపోతుంటాం. అంటే సహాయం చేసిన వారి expectations continuousగా మనమే పెంచేసి, మనని చిన్నచూపు చూసేలా మనమే అలవాటు చేసేస్తాం. అది జరగకుండా జాగ్రత్త పడండి. వారితో మీకు ఉండే చనువు, relation బట్టీ తిరిగి ఏ విధంగా మీరు ఇవ్వగలరో ఆ రూపంలో ఇచ్చినపుడు, వారు గుర్తించలేకపోయినా… మీకైతే guilt ఉండదు. ఎన్ని విధాలుగా ఇవ్వచ్చో కొన్నే చెప్తాను .. మిగతావి మీ మీ వ్యక్తిత్వం బట్టీ మీ క్రియేటివిటీకి మీరే పదును పెట్టుకోండి.
* Physical presence of service ద్వారా కావచ్చు ,
* Emotional/Financial support అవచ్చు
* ఆప్యాయంగా పలకరింపు కావచ్చు,
* చనువు బట్టీ hug…
* ఒక ఉత్తరం..
* ఏదైనా వండి ఇవ్వడం…
* మనస్ఫూర్తిగా thank you చెప్పడం….
* మీ time కేటాయించడం…
* నలుగురిలో మీ జీవితంలో వారి role ఎంత ప్రభావితం చేసిందో చెప్పగలిగే ధైర్యం, even పిల్లలు అయినా సరే… ఇలా ఎన్నో విధాలుగా చేయొచ్చు.
చివరిగా…
కృతజ్ఞత express చేయడం వల్ల, విషయ వ్యవహారాల పట్ల మన ఊహలు తగ్గుతాయి. ప్రపంచం మీకు ఏదో ఋణపడినట్లు, ఏదో చేయాలి అన్న ఆశింపు automatic గా తగ్గుతుంది.
ఇదైతే పక్కాగా చెప్పగలను.

Being Thankful is a Feeling
Being Grateful is an Action.
Feelings క్రమంగా అదృశ్యం అయిపోతాయేమో కానీ Actions గుర్తుండిపోతాయి. 😊

మళ్ళీ కలుద్దాం

స్రవంతి చాగంటి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*