
హైదరాబాద్: 500లకు పైగా సంస్థానాలు అలాగే కొనసాగితే స్వతంత్ర భారత దేశంలో జాతీయ సమైఖ్యత సాధ్యం అయ్యేదా?
నిరంకుశ నిజాం పాలన అంతమై హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చేవారా?
ఆలోచించండి..
బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం పేరుతో దేశాన్ని విభజించి, స్వదేశీ సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చి, మీ చావు మీరు చావండి అన్నట్లు గాలిలో దీపంలా వదిలేశారు.. నాటి దేశ పరిస్థితుల అస్థవ్యస్థం.. అలాంటి పరిస్థితుల్లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఉపప్రధాని, హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.. దూరదృష్టితో వ్యవహరించి చాలా తక్కువ సమయంలో సంస్థానాలన్నింటినీ దేశంలో విలీనం చేయించారు.. ఇందు కోసం సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించారు.. మీర్ ఉస్మాన్ అలీఖాన్, కాసిం రజ్వీల కపట నాటకాలకు కత్తెర వేశారు. సైనిక చర్యతో హైదరాబాద్ ప్రజలకు తరతరాల బూజు నుంచి విముక్తి కల్పించారు.
సర్ధార్ పటేల్ మహోన్నత వ్యక్తిత్వానికి దేశ ప్రథమ ప్రధానమంత్రి దక్కాలి.. అయినా నిరాశపడకుండా తనకు ఇచ్చిన బాధ్యతలకు సంపూర్ణ న్యాయం చేశారు. పటేల్ ధృడ సంకల్పం కారణంగా ఉక్కుమనిషిగా పేరు తెచ్చకున్నారు.. దేశాన్ని ఏకం చేసిన ఐక్యతా మూర్తి ఆయన.. ఆ మహనీయుడు మరికొన్నాళ్లు జీవించి ఉంటే కశ్మీర్ సమస్యను కూడా ఒక దారికి తెచ్చేవారని కచ్చితంగా చెప్పగలను..
సర్థార్ వల్లభాయ్ పటేల్ ను ఈ ఒక్కరోజు మాత్రమే కాదు.. ప్రతి భారతీయుడు, దేశ భక్తులు గుండెల్లో పెట్టుకొని స్మరించుకోవాలి.. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ప్రాత: స్మరణీయుడు..
క్రాంతి దేవ్ మిత్ర, జర్నలిస్ట్, హైదరాబాద్.
Be the first to comment