
హైదరాబాద్: శేరిలింగంపల్లి నియోజికవర్గంలో బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ గజ్జల యోగానంద్ పాదయాత్ర ప్రారంభమైంది. శేరిలింగంపల్లి 106 డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి అధ్యక్షతన రాజీవ్ గృహకల్ప ఆటో స్టాండ్, పాపిరెడ్డి కాలనీ నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా గజ్జల యోగానంద్ అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడుతూ సాగారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను పరిష్కారంలో అండగా ఉంటానని యోగానంద్ హామీ ఇచ్చారు.
పాదయాత్రలో భాగంగా గజ్జల యోగానంద్ మాట్లాడుతూ ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపేందుకు జన గళమే, బీజేపీ బలంగా ఈ పాద యాత్ర మొదలైందని చెప్పారు. ఈ పాదయాత్ర ఒక్క లింగంపల్లిలోనే కాకుండా అసెంబ్లీ డివిజన్లలో సాగుతుందని తెలిపారు. పాదయాత్రలో జనసందోహాన్ని చూస్తుంటే తెరాస పతనానికి సంకేతమని స్పష్టంగా తెలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు కాంచన కృష్ణ, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్య కుర్మ, ఉపాదక్ష్యులు కొడిదల బాబు, సి.హెచ్ బాలరాజు, కార్యదర్శి వేరేశ్ ఖేల్గీ, సూర్ణ రాజు కుర్మ, ఎం. రజనీ, బీ.జే.వై.ఎం అధ్యక్షులు క్రాంతి మాదిగ, ఉపాదక్ష్యులు శ్రీకాంత్ జక్కుల, రాజు, రవి, ప్రధాన కార్యదర్శి బొట్టు కిరణ్, మహేశ్ రాపన్, పి. కిరణ్, కార్యదర్శి పి. గిరి, పి. జగదీశ్, పి. బసంత్, కోశాధికారి పి. శివ, ఓ.బీ.సి మోర్చా అధ్యక్షులు పట్లోళ్ళ నరసింహ, ఉపాదక్ష్యులు యార బబ్లు, డీ. నవీన్ ముదిరాజ్, ఏ. రాజు, ప్రధాన కార్యదర్శి అందవేని శ్రీనివాస్, కార్యదర్శి నరసింహ, కోశాధికారి వై. రమేశ్ ముదిరాజ్, మహిళ మోర్చా అధ్యక్షురాలు కె. అరుణ కుమారి, ఉపాధ్యక్ష్యురాలు కే. శ్రీలత, ఎం. లక్ష్మ, ప్రధాన కార్యదర్శి బబ్లీ గుప్త, ఐటీ సెల్ కో కన్వీనర్ సాయి వెంకట్, నాయకులు రమేశ్ సొమిశెట్టి, శంకర్, మనోజ్, వివేక్, కార్యకర్తలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Be the first to comment