
బిజెపి నేతల ముందస్తు అరెస్టులు హేయమైన చర్య: గజ్జల యోగానంద్
హైదరాబాద్: బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం హేయమైన చర్యని శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్ విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న భయంతోనే మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టారని ఆయన చెప్పారు. బిజెపి రాష్ట్ర నాయకత్వం ఎలాంటి ముట్టడికి పిలుపు ఇవ్వకుండానే, బిజెపి నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్లో ముట్టడి కార్యక్రమం పెట్టి విధ్వంసం చేయాలని చూస్తున్నారని కేటీఆర్ అనడం విడ్డూరమన్నారు, దుబ్బాక ఎన్నికలలో బిజెపి గెలవబోతోందని, రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి అధిక స్థానాల్లో గెలుస్తుందని యోగానంద్ ధీమా వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థను ఉపయోగించి బిజెపి నాయకులను, కార్యకర్తలను అర్ధరాత్రి ఇంటికి వెళ్లి అక్రమ అరెస్టులు చేయడం, పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం ద్వారా టీఆర్ఎస్ పార్టీకి భయం పట్టుకుందనే విషయం తెలియజేస్తోందని యోగానంద్ చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నయా నిజాం పాలన సాగిస్తుందని ఆయన మండిపడ్డారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పారు. టిఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్న ఆయన రాబోయే రోజుల్లో టీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో మియపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, కేపీహెచ్బీ బీజేపీ నాయకులను, కార్యకర్తలను అర్ధరాత్రి ముందస్తు అరెస్టులు చేయడం టీఆర్యస్ చేతకానితనానికి నిదర్శమని యోగానంద్ విమర్శించారు. తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు పోరాటం చేస్తామని యోగానంద్ చెప్పారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజల ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించేందుకు ఆయన చేస్తున్న పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది.
Be the first to comment