వచ్చే నెల ఆక్స్ఫర్డ్ టీకా పరీక్షా ఫలితాలు,2021లో టీకా రానుందా ?

హైదరాబాద్ : ప్రపంచాన్నంతా అతలాకుతలం చేసిన మహమ్మారిని కట్టడి చేసి టీకా ఏప్పుడు వస్తుందని ప్రపంచమంతా ఏదిరి చూస్తున్న వేళా ,బ్రిటిష్ వారి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న టీకా యొక్క పరీక్షా ఫలితాలు వచ్చే నెల వెలువడనున్నాయి,ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ఈ టీకా చక్కటి ప్రదర్శన కానవరించింది. అయితే పరీక్షా ఫలితాలు సానుకూలంగా వచ్చిన టీకా ఇదే సమాచారంలో వస్తుందా లేక వచ్చే సమాచారం లో వస్తుందా అన్నది అతి పెద్ద ప్రశ్న. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 1.2 మిలియన్ మందిని పొట్టన పెట్టుకుంది.

సానుకూలమైన ఫలితాలు కనబరిస్తే ఈ టీకా ఈ మహమ్మారి తో జరిగే యుద్ధంలో విజయం మనదే అవుతుంది.కాగా పరీక్షా ఫలితాలను పర్యవేక్షించే అధికారి ఆండ్రూ పోల్లర్డ్ ఈ సమాచారం చివరిలో టీకా వస్తుందనే గట్టి ఆశాభావం వ్యక్తం చేసాడు. టీకా పనితీరు ఆలా ఉంటుందన్న స్పష్టత వచ్చే నెల వస్తుంది కాగా అది అప్పుడు అందుబాటులోకి వస్తుంది అందుబాటుకోలి వచ్చిన తరువాత ఎవరికి మొదలు ఇవ్వాలి అన్నది రాజకీయ పరమైన నిర్ణయం,అని ఆండ్రూ పోల్లర్డ్ పేర్కొన్నాడు.

ఇది ఇలా ఉండగా భారత్ కు చెందిన భారత్ బయోటెక్ వారి టీకా మూడో దశ పరీక్షలకు సిద్ధమైంది,ఇదే నెలలో ఆసక్తి ఉన్న వారిని ఎంచుకొని పరీక్షలు మొదలు పెడతామని వారు పేర్కొన్నారు అంతేకాక వచ్చే సమాచారం లో టీకాని అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.

-అనుదీప్ దేశాయిపేట

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*