అర్ణబ్ గోస్వామి అరెస్ట్ ! ఖండించిన ప్రముఖులు

ముంబై : మహారాష్ట్ర పోలీసలు ఈరోజు ఉదయం రిపబ్లిక్ టీవీ సంచాలకుడు అర్ణబ్ గోస్వామిని 2018లో అన్వేయ్ నైక్ మరియు అతని తల్లి కుముద్ నైక్ ల ఆత్మహతను ప్రేరేపించాడన్న అభియోగం పై అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర పోలీసులకి అన్వేయ్ నైక్ అప్పట్లో రాసిన సూసైడ్ నోట్ దొరికింది అందులో అన్వేయ్ వారికీ చాల ఆర్థిక సమస్యలు ఉన్నాయని అందుకే ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం తీసుకుంటున్నామని పేర్కొన్నాడు .
అన్వేయ్ రాసిన పత్రం లో, తన కంపెనీ కాన్కార్డ్ డిజైన్స్ కి గాను పెద్ద మొత్తంలో మూడు సంస్థలు బకాయిలు చెల్లించ లేదని అందులో ఒకరు అర్ణబ్ గోస్వామిగా పేర్కొన్నాడు. అంతేగాక అర్నాద్ గోస్వామి నుండి మొత్తం 83 లక్షల రూపాయలు రావలసుందని అయన పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా చాల మంది ప్రముఖులు దీన్ని ఖండించి ఇది పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని అభిప్రాయం పడ్డారు అందులో కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్ మరియు స్మ్రితి ఇరానీ కూడా ఉన్నారు. కేంద్ర మంత్రి జవదేకర్ సామజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకొని ఇలా స్పందించారు ఈల పత్రిక స్వేచ్ఛ పై దాడిని మేము ఖండిస్తున్నాము,ఇది పత్రిక ప్రతినిధులని ప్రవర్తించే పద్దతి కాదని మరియు ఈ సంఘటన ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేస్తుందని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ కూడా ఈ ఘటనను తనదైన శైలి లో ఖండించారు ,స్వేచ్ఛగ పని చేసే ఏ ఒక్క పాత్రికేయుడైన అర్ణబ్ గోస్వామి ని అసయించుకోవచ్చు ,తన విధానాల్ని అంగీకరించకపోవచ్చు ,తన ఉనికినే సహించలేకపోవచ్చు కానీ ఈరోజు ఈ ఘటన పై మౌనంగా ఉంటె మాత్రం పత్రిక స్వేచ్ఛను అణగతొక్కడానికి జరిగిన ఏ దాడిని సమర్థించినట్టే అవుతుందని ఆమె సామజిక మధ్యమ వేదిక ద్వారా అన్నారు.

-అనుదీప్ దేశాయిపేట

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*