వృషభోత్సవం-2020 పోస్టర్ విడుదల  

హైదరాబాద్: వేద వ్యవసాయ పండుగల్లో అతి ముఖ్యమైన వృషభోత్సవానికి రామకృష్ణ మఠం సంఘీభావం ప్రకటించింది. హైదరాబాద్ రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద వృషభోత్సవం-2020 పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషి భారతం ఆధ్వర్యంలో నిర్వహించబోతోన్న వృషభోత్సవానికి మద్దతు పలికారు. గోవులను, వృషభాలను సంరక్షించుకోవాలని, తద్వారా గో సంపదను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. వేద వ్యవసాయ పద్ధతులన్నీ ప్రకృతిని కాపాడేవని, సేంద్రీయ వ్యవసాయం రైతాంగానికి మేలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా స్వామి బోధమయానంద కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్‌కు తమ ఆశీస్సులు అందించారు. దేశవాళీ విత్తనమైన కృష్ణ వ్రీహీని కాపాడుతూ రైతన్నల్లో అవగాహన కల్పిస్తోన్న కౌటిల్యను ఆయన అభినందించారు.

 

మరోవైపు ఈ ఏడాది వృషభోత్సవాన్ని నవంబర్ 16న నిర్వహించనున్నారు. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగను నిర్వహిస్తున్నట్లు కౌటిల్య కృష్ణన్ (8686743452, 7095778791) తెలిపారు. బసవ, పరాశర, పరశురామ, కశ్యప, వశిష్ట, బలరాముడు తదితరులు గతంలో వృషభాన్ని పూజించారని చెప్పారు. తాము అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతిఏటా వృషభోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*