అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్

వాషింగ్టన్: అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమోక్రాట్ అభ్యర్ధి జో బైడెన్(77) గెలుపొందారు. కీలకమైన పెన్సిల్వేనియా, నెవెడాలను బైడెన్ గెలుచుకున్నారు. దీంతో ఆయనకు మొత్తం 284 ఎలక్టోరల్ ఓట్లు  దక్కాయి. మ్యాజిక్ నెంబర్‌ 270ని దాటి ఓట్లు రావడంతో  నూతన అధ్యక్ష ఎన్నికపై నాలుగు రోజులుగా ఏర్పడ్డ ఉత్కంఠ వీడింది.

మరోవైపు రిపబ్లికన్ అభ్యర్ధి ట్రంప్‌కు 214 ఓట్లు మాత్రమే దక్కాయి.

 

అటు డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్ష అభ్యర్ధిగా బరిలోకి దిగిన  కమలాహారిస్ గెలుపొందారు. అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై ఆమె చరిత్ర సృష్టించారు.

కోవిడ్‌పై పోరులో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శలున్నాయి. దీంతో  పాటు ఇటీవల నల్లజాతీయుడిపై దాడి అనంతరం పరిణామాల సమయంలో ట్రంప్ తీరును అంతా తప్పుబట్టారు. ట్రంప్ ఓటమికి వీటిని కారణాలుగా భావిస్తున్నారు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*