ఎందుku? ఏమిti? ఎలాగా?.. Courage (ధైర్యం)..

Courage (ధైర్యం)

జీవితంలో ఒక్కోసారి మనందరం మనకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది, విషయాలు మాట్లాడాల్సి వస్తుంది, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.
శారీరకంగా కావొచ్చు – మానసికంగా కావొచ్చు …
శారీరక ప్రమాదం, వ్యక్తి ఓర్చుకునే శక్తిని చూపిస్తే..
మానసిక ప్రమాదం, మనిషిలో గుణం, స్వభావం, ఎలాబయటపడ్డారు అన్నది కనిపిస్తుంది.
ఈ రెండు సందర్భాల్లో కూడా మనం ఎంత ధైర్యవంతులమో అన్నది బయట పడుతుంది.
ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. భయం వేసినా ధృడమైన బుద్ధితో, తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోడం, చేయవలసినవి చేయడం. అది అన్ని పరిస్థితుల్లో పనిచేయడం.

ఈసారి ‘ధైర్యం’ courage గురించి
ఎందుku? ఏమిti? ఎలాగా?

‘ధైర్యం’ అంటే …
1. జీవితంలో సంభవించే మార్పులు తట్టుకోని ఒక చర్య తీసుకోడానికి రెడీగా ఉన్నారనీ…
2. చాలాసార్లు అంతఃచేతన గొంతు నొక్కేయద్దొని దాని మాట (heart) వినమనీ…
3. పట్టుదలతో ప్రతికూలతని (adversity) ఎదుర్కోమని…
4. నిజంతో, నిజంగా నిలబడమని…
5. దృక్పధం మార్చుకుని, విస్తృతంగా విస్తరించుకొమ్మని…
అబ్బో ఆ మనిషి చాలా ధైర్యస్థుడు, ధైర్యం కలవాడు/కలది అనుకుంటూ ఉంటాం కదా… అది ఎలా కనపడుతుందంటే
– మన అభిప్రాయాలకి సులభంగా, సౌకర్యంగా అనుకూలంగా లేకపోయినా, అవసరమైన కఠిన నిర్ణయం తీసుకునే సంకల్పం, దమ్ము ఉందనీ…
– తనని తాను సంభాళించుకుని అవకాశాలు అందిపుచ్చుకోడానికి రెడీగా ఉన్నపుడు…
– ప్రపంచం నుండి తీసుకోడమే కాదు అంతకి అంతా తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉన్నారనీ.. అర్ధం. తద్వారా వచ్చే పాజిటివ్ feedback ఒక self reward లా పనిచేసి ఆత్మ గౌరవంని బలోపేతం చేస్తుంది.
-అంతర్గత విశ్వాసం (inner confidence) పెరిగి, ప్రతిదానికి బయట ప్రపంచం లేదా ఫలితాలు మీద ఆధార పడటం…. సామాజిక ఆమోదం గురించి చేయడం, భయపడటం తగ్గుతుంది.
– దానితో maturity (పరిపక్వత) వచ్చి విరుద్ధంగానూ, నచ్చనట్టూ మాట్లాడినవారిపై దాడి చేయడం, ప్రకోపాలు, ఆవేశకావేశాలు చూపించే స్థానంలో sense of humor వచ్చి చేరుతుంది, అభివృద్ధి చెందుతుంది. Reflection… అంటే ప్రతిబింబించడం ముఖ్యం అనుకుంటారు కానీ, భావోద్వేగ స్పందన కాదు. వ్యక్తిగత ఆనందం సాధించడం ముఖ్యమైన లక్ష్యం అయ్యి, ఆగ్రహం, తన మీద తనకి జాలి, పక్కవాళ్ళ మీద నింద వేయడం ఇలాంటి వాటి స్థానాన్ని ‘కృతజ్ఞత’ భర్తీ చేయడం మొదలవుతుంది.
– Basic emotions అన్నీ పక్కవాళ్ళ ప్రమేయం ‘మీద’ ఆధార పడితే, ‘ధైర్యం’ పక్కవాళ్ళ’తో ‘ ఇమడడం, కలవడం, ప్రయాణం నేర్పుతుంది. ఆందోళన (anxiety) అనిశ్చితి (uncertainity) చాలా మామూలు విషయంలా, సాధారణంగా అంగీకరించబడి, logic – balance ఏర్పడి ఎదుటివాళ్ళది నటనా, నిజామా అని కనుగొనే సామర్ధ్యం వస్తుంది.

ధైర్యాన్ని ఎన్ని విధాలుగా చూడొచ్చు? లేదా ధైర్యం ఎన్ని రకాలుగా కనబడుతుంది?

1. ఒక అన్యాయం జరిగినప్పుడు, లేదా సమానంగా చూడబడనపుడు నిలబడి ప్రశ్నించడం, చర్య తీసుకోవడం…
2. గడిచిన రోజుల్లా ఈరోజు ఉండదు…
రేపు ఈరోజులా ఉంటుందో లేదో తెలీదు…
ప్రతిరోజు ఒక కొత్తది నేర్చుకుంటాము…
ఈ processలో పాతుకుపోయి, పెరిగిపోయిన ఊహల్లో ఇరుక్కోకుండా, అనుభవం, చదువు, పరిశోధనతో.. అర్థం చేసుకుని, నేర్చుకుని అవి ఎలా ఇప్పుడు వాడాలో తెలుసుకుంటున్నపుడు….
3. ప్రతికూల పరిస్థితుల్లో ఇరుక్కున్నపుడు లేదా ఓటమి ఎదురైనప్పుడు.. స్థిరంగా, వ్యూహాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా ఉండటం…
4. వ్యక్తిగత అభిప్రాయాలు గుర్తించి, ఉద్దేశ్య పూర్వకంగా దూరం జరగడం ద్వారా ఎదుటి వారి ప్రయత్నాలు, ఫలితాలు గమనిస్తూ, ఆనందించి ఊరుకోవడం….
ఈ నాలుగింటిలో మొదటిది సామాజికంగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడితే, రెండోది…
తెలియడానికి – చేయడానికి (knowing – doing) మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. మూడోదానితో, ఎదుటివాళ్ల దృష్టితో కూడా ప్రపంచం చూడ్డం వస్తుంది…
దానితో నాల్గొవది సంభవిస్తుంది.. అది risk తీస్కోడం, కొత్త విధానం ప్రయత్నించడం, నేర్చుకోడం నేర్పుతుంది.

అసలు ధైర్యాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి?

– భయం అనిపించిన ఆ timeలో ఏం గమనించారు? మీ ఆలోచనలు ఏమిటి? మీ భావం ఏమిటి?
– మీ చుట్టూ ఉన్న వాళ్లు ఆ సమయంలో ఎలా స్పందించారు?
– ఏ timeలో తగ్గడం స్టార్ట్ అయింది? అప్పుడు మీకు ఎలా అనిపించింది?
– అదే అనుభవం లేదా experience మళ్ళీ ఎదురైనప్పుడు దాన్ని intensity అంటే తీవ్రత ఎలా ఉంది?
ఒక పెన్ను పేపరు తీసుకుని ఇవన్నీ రాయడం మొదలుపెట్టినప్పుడు, మనకు తెలియకుండానే మనలో ఉన్న భయాలు చాలామటుకు పటాపంచలు అయ్యి, భయం స్థానంలో ధైర్యం వచ్చి చేరడం మొదలవుతుంది.
ఎవరైనా సరే, ఎవరికైనా సరే.. ఇదే పద్ధతి.
అప్పుడే మన వ్యక్తిత్వంలోని మన నీడను, చీకటి కోణాల్ని చూడగలుగుతాము. అలా చూడగలిగినపుడు… విధి మనకు అనుకూలంగా ఉందే, అన్నట్టు ఉన్నట్టు అన్పించి,
సృజనాత్మకత, ఎదుగుదల, సహనము automaticగా పెరుగుతాయి.
ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా మనకు మనం అల్లుకోడం నేర్చుకుంటాం… సాలీడులాగా నైపుణ్యంగా..

మళ్ళీ కలుద్దాం

స్రవంతి చాగంటి.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*