దేశ వ్యాప్తంగా బీజేపీ హవా.. యూపీ, ఎంపీ, బీహార్, కర్ణాటక, దుబ్బాక… అన్ని ఎన్నికల్లోనూ దుమ్మురేపుతున్న బీజేపీ

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, దుబ్బాకలో బీజేపీ హవా కొనసాగుతోంది. బీహార్‌లో 243 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడియూ కూటమి దూసుకుపోతోంది.

ఎన్డీయే కూటమి 131 స్థానాల్లో గెలుపు దిశగా స్పష్టమైన సంకేతాలిచ్చింది. 72కిపైగా స్థానాల్లో బీజేపీ ముందుంది.

మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలలో ఉపఎన్నికలు జరగగా బీజేపీ 18 స్థానాల్లో ముందుంది.

యూపీలో 7 స్థానాలకు గానూ బీజేపీ 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనపడుతున్నాయి.

కర్ణాటకలో బీజేపీ రెండు స్థానాల్లోనూ విజయం దిశగా దూసుకుపోతోంది. రాజేశ్వరి నగర్, సిరా నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

 

జార్ఖండ్‌లోని దుమ్‌కా, బెర్మో స్థానాల్లో బీజేపీ గెలుపుదిశగా సాగుతోంది.

చివరగా దుబ్బాకలో బీజేపీ దుమ్మురేపుతోంది. మొదటి 6 రౌండ్లలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావు స్పష్టమైన మెజార్టీ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాత రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాసరెడ్డి మూడో స్థానంలో నిలిచారు.

దుబ్బాక
పదవ రౌండ్ లో తెరాస లీడ్ 456
బీజేపీ మొత్తం లీడ్ 3734
బీజేపీ – 31783
తెరాస- 28049
కాంగ్రెస్ – 6699

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*