
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్ సెక్టార్లో అమరులైన ఇద్దరు సైనికుల కుటుంబాలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు పరిహారం ప్రకటించారు. సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ మహేశ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిగా మహేశ్ చరిత్రలో నిలిచిపోతారని కేసీఆర్ కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వం పరంగా రూ. 50 లక్షల ఆర్థిక సాహాయం అందించనున్నట్లు వెల్లడించారు. అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. మహేశ్ కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ మహేశ్ మరణం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిగా మహేశ్ చరిత్రలో నిలిచిపోతారని కేసీఆర్ కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. pic.twitter.com/WC8YGCdTUh
— TRS Party (@trspartyonline) November 10, 2020
జవాన్ కుటుంబానికి ప్రభుత్వం పరంగా రూ. 50 లక్షల ఆర్థిక సాహాయం అందించనున్నట్లు వెల్లడించారు. అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. మహేశ్ కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయస్తామని వెల్లడించారు.
— TRS Party (@trspartyonline) November 10, 2020
మరోవైపు చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రవీణ్‌కుమార్ రెడ్డి కుటుంబానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50 లక్షల సాయం ప్రకటించారు.
ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం. వీర జవాన్ ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్న సీఎం శ్రీ వైయస్ జగన్. pic.twitter.com/jLYDdts5N2
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 9, 2020
ఈ నెల ఏడున అర్ధరాత్రి ఉగ్రవాదులు మాచిల్ సెక్టార్ మీదుగా భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించారు. ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన జవాన్లు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో వీరు అమరులయ్యారు. కెప్టెన్ అశుతోష్ కుమార్‌తో పాటు మరో సైనికుడు కూడా ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
26 సంవత్సరాల మహేశ్‌కు రెండేళ్ల క్రితమే వివాహం జరిగిందని కోమన్‌పల్లి గ్రామస్థులు తెలిపారు. మహేశ్ మరణంతో కోమన్పల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
37 సంవత్సరాల ప్రవీణ్‌కుమార్ రెడ్డి 18 సంవత్సరాల క్రితం మద్రాసు రెజిమెంట్, 18 మద్రాస్ ఆర్మీలో చేరారు. ఆయనకు భార్య రజిత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రవీణ్ హవల్దారుగా పనిచేస్తూ కమాండో ట్రైనింగ్ తీసుకున్నారు. ప్రవీణ్ అమరుడయ్యారన్న వార్తను రెడ్డివారిపల్లె జీర్ణించుకోలేకపోతోంది.
Be the first to comment