
హైదరాబాద్: వేద వ్యవసాయ పండుగల్లో అతిముఖ్యమైన వృషభోత్సవం శంషాబాద్ ముచ్చింతలలోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఘనంగా జరిగింది. చినజీయర్ స్వామి స్వయంగా వృషభపూజ చేశారు. అనంతరం ఆశ్రమంలో వృషభయాత్ర నిర్వహించారు. వృషభయాత్రలో చినజీయర్ స్వామి ఆశ్రమంలోని గురుకులం విద్యార్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వృషభాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్, ఇతర ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కార్తీక శుద్ధ పాడ్యమి సందర్భంగా జీయర్ ఆశ్రమంలో నేడే వృషభోత్సవం జరుగగా ఈ నెల 16న దేశ విదేశాల్లో నిర్వహించేందుకు కృషిభారతం ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు అనేక రాష్ట్రాల్లో, పలు దేశాల్లో వృషభోత్సవం నిర్వహించనున్నారు.
వేదాల్లో గోవుతో సమానంగా ప్రాధాన్యతను కలిగివున్న వృషభం నేడు నిరాధరణకు గురౌతున్న నేపథ్యంలో వృషభానికి పునర్ వైభవాన్ని కల్పించేందుకు కృషిభారతం ఏటా వృషభోత్సవాలు నిర్వహిస్తోంది.
ప్రాచీన వేద వ్యవసాయంపై రైతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషిభారతం కృషి చేస్తోంది. వేద వ్యవసాయ పద్ధతులను రైతన్నలకు వివరిస్తోంది. ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు, మందిరాలు, రైతుల పొలాల్లో వృషభపూజ, వృషభయాత్ర నిర్వహించనున్నారు.
Be the first to comment