1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం నాటి ముచ్చట ఇది.. లోంగేవాలా విజయంపై ఆసక్తికర కథనం

లోంగేవాలా మరోసారి నా దృష్టిని ఆకర్షించింది.. చరిత్ర గుర్తుకు వచ్చింది

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ ప్రతి దీపావళిని దేశ సరిహద్దుల్లో సైనికులతో జరుపుకోవడం చాలా గొప్ప విషయం. అందునా ఈసారి రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ సమీపంలోని సరిహద్దు లోంగేవాలాలో సైనికులతో మిఠాయిలు పంచుకొని దీపావళి జరుపుకోవడం సంతోషాన్ని కలిగించింది..

ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది మరి..

1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం నాటి ముచ్చట ఇది.. తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ గా ఆవిర్భవించిన నేపథ్యం ఈ యుద్ధానికి ఉంది. అసలు విషయానికి వస్తే.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి పాకిస్తాన్ సైన్యం 2000 మంది సైనికులు, 40 ట్యాంకులతో భారత సరిహద్దులోని లోంగేవాలా చెక్ పోస్టును సమీపించింది. అక్కడ మేజర్ చందపురి కులదీప్ సింగ్, లెఫ్టినెంట్ ధరమ్ వీర్ నాయకత్వంలో కేవలం 120 మంది భారత సైనికులే ఉన్నారు.. సకాలంలో బలగాలు అండం కష్టమైంది. అయినప్పటికీ చాలా ధైర్యంగా పాకిస్తాన్ ను ఎదుర్కొన్నారు. మరునాడు ఉదయమే భారత వాయుసేన విరుచుకుపడి పాక్ సైన్యాన్ని చిత్తు చేసింది.

నాటి యుద్ధంలో భారత్ సైన్యంలో ఇద్దరు సైనికులు అమరులైతే.. పాకిస్తాన్ సైన్యంలో 200 మంది చనిపోయారు. 36 పాక్ ట్యాంకులు ధ్వంసమయ్యాయి.

ఆనాడు భారత సైన్యం విజయం తాలూకు స్మారకం కూడా లోంగేవాలాలో చూడవచ్చు..

లోంగేవాలా విజయంపై 1997లో ‘బార్డర్’ అనే హిందీ సినిమా వచ్చింది.. చాలా అద్భుతమైన ఈ సినిమా దేశ ప్రజల హృదయాలను కదిలించించింది.. ముఖ్యంగా ‘సందేశే ఆతే హై..’ ‘ ఏ జాతే హుయే లాంహే..’ పాటలు చాలా పాపులర్.. వీలైతే అందరూ ఒకసారి చూడండి..

 

 

-క్రాంతిదేవ్ మిత్ర, జర్నలిస్ట్, హైదరాబాద్.  (90000 01607)

<iframe src=”https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fmkdmitra%2Fposts%2F3461532990594180&width=500″ width=”500″ height=”543″ style=”border:none;overflow:hidden” scrolling=”no” frameborder=”0″ allowfullscreen=”true” allow=”autoplay; clipboard-write; encrypted-media; picture-in-picture; web-share”></iframe>

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*