
టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ వ్యాపారంలోనూ తన అభిరుచి చాటుతున్నారు. రౌడీ వేర్ ఫ్యాషన్ బ్రాండ్లతో పాటు ఇటీవల ఎలక్ట్రిక్ వెహికిల్ కంపెనీలో భాగస్వామి అయ్యారు. అన్న చూపిన బాటలో తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా పయనిస్తున్నాడు. ఇటీవల మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఆనంద్ దేవరకొండ తన స్నేహితులు నిర్వహిస్తున్న “గుడ్ వైబ్స్ ఓన్లీ” కేఫ్ లో పార్టనర్ అయ్యారు. హైదరాబాద్ ఖాజాగూడలో ఈ కేఫ్ ఫుడ్ లవర్స్ ను ఆకర్షిస్తోంది. ఈ విషయాన్ని ఆనంద్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ వీకెండ్ గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్ కు వచ్చిన కస్టమర్ల సగం బిల్ తాను పే చేస్తానని విజయ్ దేవరకొండ అనౌన్స్ చేశారు.
Making the first paycheck worth it, hero @ananddeverkonda invests in 'Good Vibes Only’ cafe ☕🥤with his friends.@TheDeverakonda offers to pay half the bill of every visitor to the cafe this weekend. #GoodVibesOnly#MiddleClassMelodies #VijayDeverakonda pic.twitter.com/94xiRqhGeF
— BARaju (@baraju_SuperHit) November 25, 2020
ఆనంద్ దేవరకొండ ట్వీట్ చేస్తూ….”నేను మా అన్నయ్య విజయ్ ఇద్దరం ఫుడ్ బేస్డ్ మూవీస్ తోనే మంచి సక్సెస్ అందుకున్నాం. “మిడిల్ క్లాస్ మెలొడీస్” ద్వారా వచ్చిన నా రెమ్యునరేషన్ ను ఈ ఫుడ్ బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను. మా స్నేహితులు కలిసి నిర్వహిస్తున్న “గుడ్ వైబ్స్ ఓన్లీ” కేఫ్ లో భాగస్వామి అవడం సంతోషంగా ఉంది. మీ ప్రేమ వల్లే మా కలలను నెరవేర్చుకోగలుగుతున్నాం.” అని పేర్కొన్నారు.
Good Vibes Only Cafe – Khajaguda, Hyderabad pic.twitter.com/9XHp0qyAV8
— Anand Deverakonda (@ananddeverkonda) November 25, 2020
విజయ్ దేవరకొండ స్పందిస్తూ… “మిడిల్ క్లాస్ మెలొడీస్” సినిమా హిట్ అయిన సంతోషంలో ఉన్నాను. నేను నా ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. అందుకే ఈ వీకెండ్ “గుడ్ వైబ్స్ ఓన్లీ” కేఫ్ కు వచ్చే మీ కోసం సగం బిల్ నేను చెల్లిస్తాను. సో మీ అందరికీ వెల్ కమ్. బిల్ నాది” అని ట్వీట్ చేశారు.
Good Vibes Only 😁 https://t.co/UAS20G4g2b pic.twitter.com/mDtbF193Hc
— Vijay Deverakonda (@TheDeverakonda) November 25, 2020
Be the first to comment