
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తోన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవసాయ అంశాలపై రైతులనుద్దేశించి ప్రసంగించారు. బలవర్ధక ఆహారంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న నల్లబియ్యం( కృష్ణ వ్రీహీ)పై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో కృష్ణ బియ్యం పండించడం ద్వారా అనేక రైతు కుటుంబాలు సంపన్న కుటుంబాలుగా మారుతున్నాయని చెప్పారు. రైతుల కోసం కేంద్రం తీసుకువచ్చిన అత్యాధునిక మౌలికవసతులు వల్ల ఎలా లబ్ధి పొందుతున్నారో తెలిపేందుకు ఆయన ఒక ఉదాహరణగా చంద్రోలి రైతుల గురించి చెప్పారు. రెండేళ్ల క్రితం చంద్రోలిలో రైతులు కృష్ణ వ్రీహీలో ఒక రకాన్ని పండించారని ప్రధాని చెప్పారు. గత ఖరీఫ్‌లో 400 వందల రైతులు వీటిని పండించారు. ఈ రైతుల కోసం ప్రత్యేక సమితిని ఏర్పాటు చేసినట్లు మోదీ వెల్లడించారు. మార్కెట్ కూడా సిద్ధం చేశామన్నారు.
Boosting infrastructure for Kashi and the entire UP. https://t.co/0ueFXtVr9w
— Narendra Modi (@narendramodi) November 30, 2020
మామూలు బియ్యం కిలో 35-40 రూపాయలకే దొరుకుతున్న చోట నాణ్యమైన కృష్ణవ్రీహీ బియ్యం కిలో 300 రూపాయలకు అమ్ముడుపోతున్నాయని ప్రధాని చెప్పారు.
सरकार के प्रयासों औऱ आधुनिक इंफ्रास्ट्रक्चर से किसानों को कितना लाभ हो रहा है, इसका एक बेहतरीन उदाहरण चंदौली का काला चावल-ब्लैक राइस है।
ये चावल चंदौली के किसानों के घरों में समृद्धि लेकर आ रहा है: PM
— PMO India (@PMOIndia) November 30, 2020
విదేశీ మార్కెట్లలో కూడా నల్లబియ్యం(కృష్ణవ్రీహీ) అందుబాటులోకి రావడం గొప్పవిషయమని, తొలిసారి ఆస్ట్రేలియాకు బియ్యం పంపినట్లు తెలిపారు. ఆస్ట్రేలియాకు పంపిన కృష్ణవ్రీహీ బియ్యం కిలో 850 రూపాయలుగా నిర్ణయించినట్లు ప్రధాని వెల్లడించారు.
चंदौली के किसानों की आय को बढ़ाने के लिए 2 साल पहले काले चावल की एक वैरायटी का प्रयोग यहां किया गया था।
पिछले साल खरीफ के सीज़न में करीब 400 किसानों को ये चावल उगाने के लिए दिया गया।
इन किसानों की एक समिति बनाई गई, इसके लिए मार्केट तलाश किया गया: PM
— PMO India (@PMOIndia) November 30, 2020
ప్రధాని మోదీ వారణాసి రైతుల సభలో చెప్పిన కృష్ణ వ్రీహీ (నల్ల బియ్యం) అనేది ప్రాచీన భారతీయ వరి వంగడమని, సుశృత సంహిత, చరక సంహితలో దీని గురించి ప్రస్తావించారని కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ (8686743452) తెలిపారు. కరీంనగర్ ఖాసింపేటలో ఆయన కృష్ణ బియ్యం పండిస్తున్నారు. ప్రాచీన కాలంలో ఈ వరికి మతపరమైన ప్రాధాన్యం ఉండేదని, వీటిని యజ్ఞాలు, ఇతర పండుగల్లో ఉపయోగించేవారని కౌటిల్య తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం కృష్ణ వ్రీహీని ఈశాన్య రాష్ట్రాలతో పాటు, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో పండిస్తున్నారని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణ బియ్యంపై రైతన్నల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తమ కృషి భారతం కృషి చేస్తోందని ఆయన చెప్పారు.
Be the first to comment