‘కళాపోషకులు’ సినిమా రివ్యూ..

సినిమా : కళాపోషకులు
రిలీజ్ తేదీ : జనవరి-29
బ్యానర్ : శ్రీ వెన్నెల క్రియేషన్స్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ : చలపతి పువ్వుల
నిర్మాత, స్టొరీ : సుధాకర్ రెడ్డి. ఎమ్
నటీనటులు : విశ్వకార్తికేయ, దీప ఉమాపతి, భాష, చైతన్య, చిన్ను, చిట్టిబాబు, గడ్డం నవీన్, జెమినీ, అనంత్ బాబు తదితరులు.
కెమెరామెన్ : కళ్యాణ్ సమి
ఎడిటర్ : సెల్వ కుమార్
సంగీతం : ఎలేందర్ మహావీర్
డిజైన్ : గణేష్
పీఆర్ఓ : సాయి సతీష్ పాలకుర్తి

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే జనాలు కోలుకుంటున్నారు. ఇన్నిరోజులు ఓటీటీలోనే సినిమాలు చూసిన జనాలు.. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసరికి కాస్త ఊపిరిపీల్చుకుని థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో ఒకట్రెండు చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కాగా.. తాజాగా సుధాకర్ రెడ్డి నిర్మాతగా.. చలపతి పువ్వుల దర్శకత్వంలో .. విశ్వకార్తికేయ, దీప ఉమాపతి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కళాపోషకులు’. ఈ నెల 29న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఉన్నంతలో థియేటర్లు దక్కినప్పటికీ జనాలు బాగానే చూస్తున్నారు. యూత్ ఎంటర్‌టైనర్, లవ్ ట్రాక్ కావడంతో యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లు ఇంకొన్ని దొరికుంటే బాగుండేది.. అయినప్పటికీ సినిమాకు మాత్రం మంచి పేరొచ్చింది. సినిమా ఎలా ఉంది..? సినిమా గురించి యూత్‌లో టాక్ ఎలా ఉందనే ఇంట్రెస్టింగ్ విషయాలను eekshanam.com రివ్యూలో చూద్దాం.

కథ :-
సాధారణ కుటుంబానికి చెందిన భాను అనే కుర్రాడు.. డబ్బులున్న అమ్మాయిని లవ్ చేయాలని తహతహలాడుతుంటాడు. మనకెలాగో డబ్బులు లేవు గనుక మంచి డబ్బులున్న అమ్మాయిని లవ్ చేస్తే లైఫ్ సెటిల్ అవుతుందని భావించి.. వెతుకుతుండగా ప్రీతి అనే అమ్మాయికి ఫిదా అయిపోతాడు. మొదట డబ్బుల కోసమే లవ్ చేసినప్పటికీ ఆ తర్వాత పూర్తి ప్రేమికుడిగా మారిపోతాడు. ఈ క్రమంలో తన నాన్నమ్మ.. మరదల పిల్లను ఇచ్చి బలవంతంగా పెళ్లి చేయాలని అనుకుంటుంది. అంతేకాదు.. సడన్‌గా ఎంగేజ్మెంట్ కూడా చేసేస్తుంది. అప్పటికే ఒకట్రెండు సార్లు ప్రీతి చుట్టూ తిరిగి.. ఆమె గురించి తెలుసుకున్న హీరో చివరికి లవ్‌లో పడతాడు. తల్లి చనిపోవడంతో క్రుంగిపోయి ఉన్న ప్రీతి.. సడన్‌గా తండ్రిని కోల్పోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, బంధువులు లేని ప్రీతికి చావే చుట్టం అన్నట్లుగా బతికేస్తుంటుంది. అలాంటి సమయంలో భాను పరిచయం అవ్వడంతో ప్రేమలో మునిగితేలతారు. ఇద్దరూ డేట్‌కు వెళ్లాలని ఫిక్స్ అవుతారు. అయితే డేట్‌కు వెళ్లాక ఒక్కసారిగా ప్రీతి అడ్రస్ లేకుండా పోతుంది..? ఆ అమ్మాయి ఎక్కడికెళ్లింది..? ప్రీతి కోసం భాను పడే కష్టాలు..? జబ్బుతో చనిపోయాడనుకున్న ప్రీతి తండ్రిని బలవంతంగా చంపిందెవరు..? అసలు ప్రీతి ఆస్తులు దక్కించుకోవాలని ప్లాన్ చేసిందెవరు..? భాను డబ్బుల కోసం లవ్ చేసి చివరికి ఏం చేస్తాడు..? అనే ట్విస్ట్‌లు తెలియాలంటే థియేటర్లలోకి వెళ్లి చూడాల్సిందే.

ఈ క్షణం విశ్లేషణ :-
సినిమా ప్రొడ్యూసర్ చాలా బాగా కష్టపడ్డారు. మరీ ఎక్కువగా బడ్జెట్ పెట్టకుండా.. అలాగనీ అంత తక్కువగాను పెట్టకుండా పెట్టాల్సినంత పెట్టి నిర్మించేశాడు. అయితే కరోనా కష్టకాలంలో థియేటర్లు దొరక్కపోవడంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. థియేటర్లు ఇంకా కొన్ని దొరికుంటే బాగుండేది. తను అనుకున్న బడ్జెట్‌లో నటీనటులను ఎంచుకొని.. మంచి మంచి ప్రదేశాలనే ఎన్నుకొన్ని సినిమాను తెరకెక్కించారు. కొత్త నిర్మాతే అయినప్పటికీ మంచి కథనే ఎన్నుకుని మంచి నిర్మాణ విలువలను చూపించారు. సినిమా మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రదేశాల్లోనే జరిగిపోయినట్టుంది. దర్శకత్వం విషయానికొస్తే.. తాను అనుకున్నది మాత్రమే తెరకెక్కించాడు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ మొత్తం అన్నీ తానై కథను ముందుకు నడిపించి కొత్త డైరెక్టరే అయినప్పటికీ ఫర్లేదు అనిపించుకున్నాడు. ఫస్టాప్‌లో అంతగా విషయం లేకపోయినప్పటికీ.. సెకాండాఫ్ మాత్రం మంచి ట్విస్ట్‌లతో ఇంట్రెస్టింగ్‌గా అభిమానులను ముందుకు తీసుకెళ్లాడు. కొన్ని కొన్ని సీన్లు చూస్తే ఇవి అవసరమా అనిపించింది. సాంగ్స్ అన్నీ బాగున్నాయ్. మరీ ముఖ్యంగా.. ‘నువ్వేలే.. నువ్వేలే..’, ‘అన్‌లిమిటెడ్ వండర్’ అనే ఐటమ్ సాంగ్ ప్రేక్షకుల్లో కాస్త ఊపు తెప్పించాయ్. ఇక ఎలేందర్ మహావీర్ మాత్రం సంగీతం ఇరగదీశాడు. మరీ ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదుర్స్ అంతే.. ఈ సినిమాకే ఇదే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక నటీనటుల విషయానికొస్తే.. ఎవరి పాత్రకు వాళ్లు న్యాయం చేశారు.. అందరూ తమలోని ‘కళ’ను బయటపెట్టారు.

నటీనటులు.. సాంకేతికత గురించి..!? :-
సినిమాలో చాలా తక్కువ పాత్రలే ఉన్నా.. అందరూ బాగా నటించారు. వారికి ఇచ్చిన పాత్రలకు అందరూ న్యాయం చేశారు. హీరో, హీరోయిన్ ఇద్దరూ బాగా నటించారు. వీరిద్దరికీ మంచి ఫ్యూచర్ ఉంది. బాల నటుడిగా ‘ఆ నలుగురు’ సినిమాతో పరిచయమైన హీరోకు.. ఈ సినిమాతో తనలోని నటుడ్ని బయటికి తీశాడు. హీరోయిన్ కూడా బాగానే నటించి.. తన అంద చెందాలతో యూత్‌ను ఆకట్టుంది. అయితే.. సినిమా చూసిన సదరు ప్రేక్షకుడికి భాను-ప్రీతిని ఇంకా చూపించుంటే బాగుండేదనిపిస్తుంది. ఇక హీరో ఫ్రెండ్స్ ఇద్దరూ ఫర్లేదు అనిపించారు. ప్రిన్సిపాల్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి కామెడీ బాగుంది. అలాగే భానుకు నాన్నమ్మగా నటించిన రాములమ్మ మాత్రం కామెడీని పండించేసింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత సీరియస్‌గా ఉన్నప్పటికీ ఆమె కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు. మరీ ముఖ్యంగా ‘పచ్చళ్లు చేయాల్సిందే..’ అనే డైలాగ్‌లో హాస్యం పండించేసింది. కమెడియన్ అనంత్ బాబు గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పలు చిత్రాల్లో తన హాస్యం కడుపుబ్బా నవ్వించిన ఆయన.. ఈ చిత్రంలో పెదరాయుడి గెటప్‌లో ‘గంట మాస్టర్’గా నటించాడు. మాటకు ముందు గంట.. మాట తర్వాత గంట.. ఇలా క్రమశిక్షణతో అందర్నీ కడుపుబ్బా నవ్వించాడు. ఇందులో ఇద్దరూ డాక్టర్ పాత్రదారులు ఉండగా.. ఒకరేమో కన్నింగ్.. ఇంకొకరేమో కన్‌సర్న్ చూపిస్తుంటారు. జెమినీ సురేష్ యాక్టింగ్ బాగుంది.. ఆయనకిచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. ఇక మిగిలిన నటులు భాష, చైతన్య, చిన్ను, జ్వాల, జబర్దస్త్ నవీన్ తదితరులు బాగా నటించారు. జబర్దస్త్ నవీన్ ఈ సినిమాలోనే ఫస్ట్ టైమ్ ఇలా విలన్ క్యారెక్టర్‌గా నటించాడు. ఆయన యాక్టింగ్ ఫర్లేదు.. మున్ముంథు కూడా కామెడీతో కూడిన విలన్ పాత్రలకు తీసుకోవచ్చు. ఇలా ఎవరికిచ్చిన పాత్రలకు వాళ్లు న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. అన్నీ ఉన్నప్పటికీ ఏదో లేని లోటు మాత్రం సినిమాలో కనిపిస్తోంది. కెమెరా వర్క్, ఎడిటింగ్ అంతా బాగున్నాయ్. ఇలా నటీనటులు, సాంకేతికత అంతా బాగుంది.

ప్లస్ పాయింట్స్.. :-
యంగ్ హీరో తన మొదటి సినిమాతో టాలెంట్ చూపించాడు. హీరో, హీరోయిన్ నటన బాగుంది.
సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్.. సినిమా ఇవే ప్రాణం
పాటలు బాగున్నాయ్..
ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయ్
రాములమ్మ, గంట మాస్టర్‌ల కామెడీ.
సెకాండప్ కథ బాగుంది.

మైనస్ పాయింట్స్ :-
అనవసరపు సీన్లు.. (అక్కడక్కడా కొన్ని సీన్లు బోరింగ్ అనిపించాయ్)
ఫస్టాప్..
డైరెక్టర్ ఇంకాస్త తన ఆలోచనలకు, క్రియేటివిటీకి పదునుపెట్టుంటే బాగుండేది అనిపించింది. పాత సినిమాల్లోని కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకొని దాన్నే కామెడీ, పాటగా చిత్రీకరించాడు. మొత్తంగా సినిమా బాగుంది.. యూత్‌ను ఆకట్టుకుంటుంది.

ఈక్షణం రేటింగ్ : 2:7.5/5
ట్యాగ్‌లైన్ : యూత్‌ను అట్రాక్ట్ చేసే ‘కళాపోషకులు..’

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*