తెలుగంటే ప్రత్యేక ప్రేమ- ప్రముఖ నటి సీత

తమదైన అభినయం, ఆహార్యంతో తాము పోషించే పాత్రలకు ఓ ప్రత్యేకతను, హుందాతనాన్ని తీసుకొస్తారు కొందరు నటీమణులు. అలాంటి అరుదైన నటీమణుల్లో ఒకరు ‘సీత’. “ఆడదే ఆధారం, డబ్బెవరికి చేదు, సగటు మనిషి, న్యాయం కోసం, ముత్యమంత ముద్దు, పోలీసు భార్య, చెవిలో పువ్వు, ముద్దుల మావయ్య” తదితర చిత్రాలతో తెలుగులో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న సీత… క్యారక్టర్ ఆర్టిస్టుగానూ తనదైన ముద్ర వేశారు. ‘గంగోత్రి, సింహాద్రి, బన్నీ, జో అచ్యుతానంద”‘ వంటి చిత్రాలు నటిగా సీత ప్రతిభను, ప్రత్యేకతను నేటి తరం ప్రేక్షకులకు కూడా పరిచయం చేశాయి.

తెలుగుతోపాటు… తమిళ, మళయాళ, కన్నడలోనూ సుప్రసిద్ధురాలైన సీత… అడపాదడపా అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నప్పటికీ… స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయాలనే గట్టి ఆసక్తితో ఉన్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఇచ్చి నటిగా తనకంటూ మంచి స్థానం ఇచ్చిన తెలుగు పరిశ్రమ పట్ల, తనపై ఇప్పటికీ ఎంతో ఆదరణ చూపే తెలుగు ప్రేక్షకుల పట్ల తనకు ప్రత్యేక ప్రేమాభిమానమని సీత చెబుతున్నారు.అన్నట్లు సీత అచ్చ తెలుగమ్మాయి. ఆమె మూలాలు ఉన్నది ఇక్కడే. ఆమె ఫోర్ ఫాదర్స్ స్వస్థలం విజయనగరం. అందుకే ఆమె చాలా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతుంది!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*