
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. దేశంలో నిరంతరం నిరసనలు కొనసాగాలనుకునే వారిని గుర్తించాలని, అలాంటివారి నుంచి దేశాన్ని కాపాడాలని మోదీ సూచించారు. ఆందోళన జీవులు పరాన్నజీవులని మోదీ ఎద్దేవా చేశారు. ఎక్కడ, ఎవరు, ఏ ఆందోళన చేసినా అక్కడ వారు వాలిపోతుంటారని, నిరసనలు, ఆందోళనలు జరపకుండా వారు జీవించలేని స్థితిలో ఉంటారని, అలాంటివారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫారెన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ కలిగి ఉన్నవారితో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని సూచించారు.
We must save India from a new version of FDI – Foreign destructive ideology.
While we must keep the first form of FDI intact, foreign direct investment, we must protect ourselves from the new version of FDI!
– PM Shri @narendramodi #PMinRajyaSabha pic.twitter.com/38vqGG7cA3
— BJP (@BJP4India) February 8, 2021
LIVE: PM Shri @narendramodi's reply to the motion of thanks on the President's Address in the Rajya Sabha. #PMinRajyaSabha https://t.co/Kj67VyEMjd
— BJP (@BJP4India) February 8, 2021
సిక్కు సమాజంపై దేశం గర్వంగా ఉంటుందని, వారు త్యాగానికి మారుపేరని మోదీ కీర్తించారు. గొప్ప గురు పరంపరను సిక్కు సమాజం దేశానికిచ్చిందని చెప్పారు. కొందరు పనిగట్టుకుని సిక్కులను పక్కదోవ పట్టిస్తున్నారని మోదీ చెప్పారు.
India is very proud of the contribution of Sikhs. This is a community that has done so much for the nation. The words and blessings of the Guru Sahibs are precious: PM @narendramodi #PMinRajyaSabha
— PMO India (@PMOIndia) February 8, 2021
కనీస మద్దతు ధర ఎప్పటికీ ఉంటుందని మోదీ మరోసారి రైతులకు భరోసా ఇచ్చారు. సాగు చట్టాలపై దుష్ప్రచారం ఆపాలని సూచించారు. వ్యవసాయరంగంలో సంస్కరణలు తప్పనిసరి అని చెప్పిన ఆయన సాగు చట్టాల్లో లోపాలుంటే సరిచేసుకుందామన్నారు. ఆందోళన విరమించి సమస్య పరిష్కారం కోసం చర్చలు జరపాలని ప్రధాని సూచించారు.
मैं आप सभी को निमंत्रण देता हूं कि हम देश को आगे बढ़ाने के लिए, कृषि क्षेत्र के विकास के लिए, आंदोलनकारियों को समझाते हुए, हमें देश को आगे ले जाना होगा।
आइए मिलकर चलें।
– पीएम श्री @narendramodi #PMinRajyaSabha
— BJP (@BJP4India) February 8, 2021
ప్రసంగంలో ప్రధాని సుభాష్ చంద్రబోస్‌ను గుర్తు చేసుకున్నారు. జాతీయవాదమనేది సత్యం, శివం, సుందరం అనే మూలాల నుంచి గ్రహించబడినదని చెప్పారు.
हमारा लोकतंत्र किसी भी मायने में वेस्टर्न इंस्टीट्यूशन नहीं है, ये एक ह्यूमन इंस्टीट्यूशन है।
भारत का राष्ट्रवाद सत्यम, शिवम, सुंदरम मूलों से प्रेरित है।
ये वक्तव्य आजाद हिंद फौज की प्रथम सरकार के प्रथम प्रधानमंत्री नेताजी सुभाष चंद्र बोस का है।#PMinRajyaSabha pic.twitter.com/JPLnXctzAl
— BJP (@BJP4India) February 8, 2021
కొందరు తనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, తనను విమర్శించడం ద్వారా ఆనందం పొందుతున్నారని మోదీ చెప్పారు. వారి ఆనందానికి కారణమౌతున్నందుకు తనకు కూడా ఆనందంగానే ఉందంటూ విమర్శలకు మాత్రమే పరిమితమౌతున్న వారికి మోదీ చురకలంటించారు. మోదీ ఉన్నంతవరకూ విమర్శకులకు అవకాశం ఉంటుందంటూ తమ ప్రసంగాన్ని ముగించారు.
Be the first to comment