వీవీ వినాయక్ అభినందనలు అందుకున్న చిత్రం.. ఏప్రిల్ 28న ఏం జరిగింది?

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు వినాయక్ గారు మా చిత్రం ట్రైలర్ చూసి అభినందించడం.. చిత్ర విజయంపై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది అంటున్నారు దర్శకుడు వీరాస్వామి.జి. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఏప్రిల్ 28న ఏం జరిగింది. రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని పనులను పూర్తిచేసుకుంది. మార్చి 5న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ మా చిత్రం ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌తో మరింత ఉత్కంఠను పెంచింది.వినాయక్ గారికి మా ట్రైలర్ నచ్చడంతో పాటు సినిమా విజయం సాధించాలని మాకు ఆల్‌దిబెస్ట చెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఓ వినూత్నమైన కథతో ఎవరూ అంచనా వేయలని ట్విస్ట్‌లతో రూపొందుతున్న మా చిత్రం ప్రతి మలుపు ఆసక్తికరంగా థ్రిల్లింగ్‌గా వుంటుంది.థ్రిల్లర్ జోనర్‌లో ఇటువంటి కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకు ఏ చిత్రం రాలేదు. తప్పకుండా చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటుంది అన్నారు.

 

అజయ్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్, కెమెరా: సునీల్‌కుమార్, స్క్రీన్‌ప్లే: హరిప్రసాద్ జక్కా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*