ప్రతిపక్ష నేతకు ప్రధాని మోదీ సెల్యూట్

న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌కు ప్రధాని మోదీ సెల్యూట్ చేశారు. రాజ్యసభలో ఎంపీల వీడ్కోలు సందర్భంగా ప్రసంగించిన ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. ఆజాద్ సేవల గురించి ప్రస్తావిస్తూ మోదీ కంటతడి పెట్టారు. దేశానికి ఆజాద్ చేసిన సేవలను మోదీ ప్రశంసించారు. పదవిలో ఉన్నా లేకున్నా ఆజాద్ ఒకేలా ఉన్నారన్నారని మెచ్చుకున్నారు. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా చేస్తున్న సమయంలో జరిగిన ఘటనలను మోదీ గుర్తు చేసుకున్నారు.

మోదీ కన్నీళ్లు పెట్టుకోవడంతో సభ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత మోదీ ఆజాద్‌కు సెల్యూట్ చేయడంతో సభ్యులంతా బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు.  మోదీ సెల్యూట్ చేయడంతో గులాం నబీ నమస్కారం పెట్టారు.

ఆజాద్ తర్వాత రాజ్యసభలో ఆ స్థానంలోకి వచ్చే వారు ఆయనలా బ్యాలన్స్ చేయడం కష్టమని మోదీ చెప్పారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*