మహబూబ్ కాలేజీలో ‘స్వామి వివేకానంద’ జ్ఞాపకాలు

హైదరాబాద్: స్వామి వివేకానంద .. ఈ పేరు వింటే చాలు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయనే కళ్ల ముందు ప్రత్యక్షమైతే.. సరిగ్గా 128 ఏళ్ల క్రితం భాగ్యనగర వాసులు ఇదే అనుభూతికి లోనయ్యారు. ఆ ఆధ్యాత్మిక శిఖరాన్ని దర్శించి తన్మయత్వానికి గురయ్యారు. పశ్చిమ దేశాల పర్యటనకు ముందు స్వామి వివేకానంద తొలిసారి హైదరాబాద్ నగరానికి వచ్చి.. ఇక్కడ బస చేశారు. ఫిబ్రవరి 10న నగరానికి వచ్చిన ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో ‘మై మిషన్ టు ది వెస్ట్’ పేరుతో జరిగిన సభలో స్వామి వివేకానంద ప్రసంగించారు. యూరోపియన్లతో పాటు సుమారు వెయ్యిమంది ఈ సభకు హాజరయ్యారు. పాశ్చాత్య దేశాలకు తాను వెళ్లడంలోని తన అంతర్యాన్ని స్వామీజీ వివరించారు.

 

ఆ నాటి స్వామిజీ ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటూ.. మహబూబ్ కాలేజీలో ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. శనివారం ఉదయం 11 గంటలకు కాలేజీలోని స్వామిజీ విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించనున్నారు. స్వామిజీ మాటలను గుర్తు చేసుకోనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*