ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి టీ-20 సిరీస్ నెగ్గిన భారత్

అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన టీ-20 ఫైనల్ మ్యాచ్‌లో నెగ్గి భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. 3-2తో సిరీస్ గెలుచుకుంది.

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో కోహ్లీసేన చెలరేగి ఆడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 224 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ 52 బంతుల్లో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి. రోహిత్‌ శర్మ 34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. సూర్యకుమార్‌ 32, హార్దిక్‌ పాండ్యా 39 పరుగులు చేశారు. భువనేశ్వర్‌ 15 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. శార్దూల్‌ 45 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో భారత్‌ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.

భారత్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్య సాధనలో ఇంగ్లండ్‌ చతికిలపడింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్‌ మలాన్‌ 68, బట్లర్‌ 52 పరుగులు చేశారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు భువనేశ్వర్‌కు దక్కింది.

విరాట్‌ కోహ్లీ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ దక్కించుకున్నాడు.

సిరీస్ నెగ్గిన కోహ్లీసేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లాండ్‌పై టెస్ట్ సిరీస్‌తో పాటు టీ20 సిరీస్‌కూడా నెగ్గి భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*