చైనా టీకాను నమ్మి గుంతలో పడిన ఇమ్రాన్

ఇస్లామాబాద్: చైనా టీకా తీసుకున్న రెండు రోజుల్లోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఐసోలేషన్‌లో ఉన్నారని ప్రధాని ఆరోగ్య కార్యదర్శి ఫైసల్ సుల్తాన్ ట్వీట్ చేశాడు. అంతకు మించి వివరాలు మాత్రం ఇవ్వలేదు.

అయితే ఇమ్రాన్ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. 68 సంవత్సరాల ఇమ్రాన్ కొద్ది రోజులుగా ఇస్లామాబాద్‌లో అనేక మందిని కలిశారు. వ్యాక్సిన్ తీసుకున్న ధీమాతో మాస్కులు లేకుండానే సదస్సులకు హాజరయ్యారు. దీంతో కరోనా బారిన పడ్డారు. పాపం చైనా టీకాపైన పెట్టుకున్న అతి విశ్వాసం ఆయన్ను నిండా ముంచినట్లైంది.

మరోవైపు ఇమ్రాన్ త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

 

పాకిస్థాన్‌లో ఇప్పటి వరకూ 6 లక్షలా 15వేల మందికి కరోనా సోకింది. 13,700 మంది చనిపోయారు. పాక్‌లో ధనిక ప్రాంతంగా పేరున్న పంజాబ్ ప్రావిన్స్‌లో కేసులు పెరుగుతున్నాయి. బ్రిటన్ స్ట్రెయిన్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో ఎక్కడ చూసినా కరోనా పేషంట్లే కనపడుతున్నారు. కరోనాను కట్టడి చేసే చర్యలు దాదాపు శూన్యం.

 

వాస్తవానికి పేద దేశాల జాబితా కింద పాకిస్థాన్‌కు భారత్ నుంచి 5 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుతున్నాయి. గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సిన్స్ ఇమ్మునైజేషన్ పథకం కింద భారత తయారీ వ్యాక్సిన్లు పాకిస్థాన్‌కు పంపిస్తున్నారు. భారత వ్యాక్సిన్లు వేసుకుంటే భారత్‌కు మంచి పేరు వస్తుందని, దేశీయంగా తనకు వ్యతిరేకత వస్తుందనుకున్నారో ఏమో కానీ చైనా టీకాను వేసుకున్న ఇమ్రాన్ కరోనా బారిన పడటం చర్చనీయాంశంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*