వేద వ్యవసాయ ప్రయోగాలతో మళ్లీ సక్సెస్ అయిన కౌటిల్య కృష్ణన్

హైదరాబాద్: వేద వ్యవసాయ ప్రయోగాలతో కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ ( 86867 43452) మరోసారి సక్సెస్ సాధించారు. కరీంనగర్ జిల్లా ఖాసింపేట గ్రామంలోని తన 3 ఎకరాల పొలంలో కృష్ణ వ్రీహీ (నల్ల బియ్యం) పండించడంలో మరోసారి విజయవంతమయ్యారు. తన పొలం నుంచే పండించిన కృష్ణ వ్రీహీ విత్తనం ద్వారా పంట వేసి మరోసారి విజయం సాధించారు.

తెలంగాణ ప్రాంతంలో రైతులు అనాదిగా అనుసరించే మండి కట్టే పద్ధతితో పాటు వేద వ్యవసాయ పద్ధతులు ఫాలో అయినట్లు చెప్పారు.

డిసెంబర్ మాసంలో విత్తనం వేశాక ప్రస్తుతం చూస్తే వంద శాతం పంట వచ్చిందని కౌటిల్య తెలిపారు.

https://www.facebook.com/102627268570754/posts/118092997024181/

వేద వ్యవసాయంలో భాగంగా పాలు, తేనెతో పాటు అగ్నిహోత్ర భస్మం కూడా వాడినట్లు చెప్పారు. ఆవుపేడను ఎరువుగా వాడినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో వేద వ్యవసాయం ద్వారా వంద శాతం పంట పండిందని చెప్పారు. జిల్లాలోని మిగతా చాలా చోట్ల రైతులు కెమికల్స్‌తో వ్యవసాయం చేశారని, అయితే వేద వ్యవసాయం ద్వారా తన పంటే మెరుగ్గా పండిందని వెల్లడించారు. చుట్టుపక్కల రైతులు కూడా కౌటిల్య పొలాన్ని సందర్శించి ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరో రెండు రోజుల్లో కరీంనగర్ కలెక్టర్ శశాంక్ కూడా కౌటిల్యుడి పొలాన్ని సందర్శించనున్నారు. ఇటీవలే కౌటిల్య కృష్ణన్ కలెక్టర్ శశాంక్‌ను కలిసి కృష్ణ వ్రీహీ శాంపిల్ అందించారు.

దేశీయ విత్తనాల వల్ల ప్రయోజనాలివే:

నాటు విత్తనాలు వాడటం ద్వారా పురుగులు వచ్చే శాతం తక్కువ.
రుచి బాగుంటుంది.
విత్తనాలు వంద శాతం మొలకెత్తే అవకాశం ఉంటుంది.
భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కూడా ఉంటుంది.
నీళ్లు ఎక్కువగా అవసరం లేదు.
ఎలాంటి భూమిలోనైనా పంట బాగా పండుతుంది.
పంట దిగుబడి బాగా వస్తుంది.
రైతన్నలు నాటు విత్తనాలు నిల్వ చేసుకుని తదుపరి పంటకు మళ్లీ వేసుకోవచ్చు.
దేశీయ విత్తనాల్లో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి.
ఆరోగ్యానికి మేలు చేసే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.
దేశీయ విత్తనాలు వాడటం వల్ల ఆర్ధికంగా కూడా రైతులు లాభపడతారు.
దేశీయ విత్తనాల వల్ల అన్నదాతలు ఆర్ధికంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు.

 

రైతన్నలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఆర్ధికంగా కూడా బాగుపడాలని కోరుకుంటూ కృషీ భారతం చైతన్యవంతమైన కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా అనేక మంది వ్యవసాయ నిపుణులతో కలిసి ప్రయోగాలు చేస్తూ విజయవంతమౌతోంది.

https://krishibharatham.org/ 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*