
హైదరాబాద్: రేడియో జాకీలంటేనే మల్టీ టాలెంటెడ్ అని అందరూ అంటుంటారు. స్క్రిప్ట్ రాసుకోవడంతో పాటు మంచి వాయిస్ ఓవర్ ఇవ్వడం, పాటలు పాడటం, అలసట లేకుండా గంటల తరబడి ఒకే ఉత్సాహంతో, బోర్ కొట్టించకుండా విషయాలను అందించడం చూస్తూనే ఉంటాం. రేడియో నుంచి మొదలుకుని బుల్లితెరతో పాటు సిల్వర్ స్క్రీన్‌పై సత్తా చాటిన రేడియో జాకీలను ఇప్పటికే చూశాం. అయితే ఇప్పుడు వీరు మరో రంగంలోనూ రాణిస్తున్నారు. రచయితలు, కవులుగా, కవయిత్రులుగా మారి సాహిత్య రంగంలోనూ సత్తా చాటుతున్నారు. సీనియర్ కవులు, ప్రశంసలు పొందుతున్నారు. ప్రతి పోటీలోనూ గొప్ప ప్రదర్శన కనబరుస్తూ ప్రశంసా పత్రాలు పొందుతున్నారు. బిరుదులతో పాటు అవార్డులు, రివార్డులు పొందుతున్నారు. హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో 101.9 రెయిన్ బో ఎఫ్ ఎం రేడియో జాకీలు మంజీత కుమార్, బొలిశెట్టి స్వాతి, లక్ష్మి పెండ్యాల సాహిత్యరంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే తమ ప్రతిభ చాటుకుంటున్నారు. వీరి రచనలు ప్రాముఖ్యతను సంతరించుకుని పాఠకులను అలరిస్తున్నాయి. వీరి సాహితీ సేవకు సన్మానాలు లభిస్తున్నాయి.
సాహితీ బృందావన విహార జాతీయ వేదిక ఖమ్మం ఆధ్వర్యంలో అంతర్జాల వేదికగా ఉగాది విశిష్ట ప్రతిభా పురస్కారాలు 2021 అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈక్షణం సీనియర్ జర్నలిస్ట్, ఫీచర్స్ ఇంఛార్జ్, రచయిత్రి మంజీత కుమార్‌కు ‘సాహిత్య కళానిధి’ బిరుదును ప్రధానం చేయడం జరిగింది.
https://www.facebook.com/manjeetha.bandeela/posts/10225620849175196
కవితల కోవెల అంతర్జాతీయ సాహితీ వేదిక, గౌతమేశ్వర సాహితీ సంస్థ, ఎస్వీఆర్ స్టూడియోస్ ఆధ్వర్యంలో మంథనిలో జాతీయ స్థాయి బహుభాషా కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవయిత్రులు లక్ష్మి పెండ్యాల, స్వాతి బొలిశెట్టిలకు ‘సాహితీ కిరణం’ బిరుదు ప్రదానం చేశారు.
https://www.facebook.com/swathi.komirishetty.3/posts/3858473624240775
లక్కీ లక్ష్మీ పెండ్యాల అయితే మరో అడుగు ముందుకేసి సినిమాలకు పాటలు కూడా రాసేస్తున్నారు.
https://www.facebook.com/rjlucky101.9/posts/5961880610504487
మంజీత ఈక్షణం పాఠకులకు రేడియో జాకీలందరినీ ఇప్పటికే పరిచయం చేశారు. ఆమె చేసిన ఇంటర్వ్యూలు ఎంతో పాపులర్ అయ్యాయి. గతంలో అనేక టీవీ ఛానెళ్లలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేసిన మంజీత సాహితీ రంగంలోనూ మంచిపేరు తెచ్చుకుంటున్నారు.
https://www.facebook.com/manjeetha.bandeela/posts/10224349390549525
https://www.facebook.com/manjeetha.bandeela/posts/10224296852116097
https://www.facebook.com/manjeetha.bandeela/posts/10224244047596017
https://www.facebook.com/manjeetha.bandeela/posts/10224190800064862
Be the first to comment