
చెన్నై: సినీ నటుడు కమల్ హాసన్ ప్రారంభించిన మక్కల్ నీది మయ్యం పార్టీకి ఘోర పరాభం ఎదురైంది. స్వయంగా కమల్‌హసన్ సౌత్ కోయంబత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ చేతిలో కమల్ ఓటమి చవి చూశారు.
అంతేకాదు పోటీచేసిన 142 చోట్ల ఎంఎన్ఎం పార్టీ అభ్యర్థులంతా పరాజయం పాలయ్యారు. తమిళ రాజకీయాల్లో సత్తా చాటుదామనుకున్న కమల్‌హాసన్‌కు తమిళ ఓటర్లు చెక్ పెట్టేశారు. ఆదిలోనే చిత్తుగా ఓడిపోయిన పార్టీ భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపలేదని పరిశీలకులు చెబుతున్నారు. నటుడిగా కమల్ ఆదరణ పొందినా ప్రజల విశ్వాసం మాత్రం చూరగొనలేకపోయారు.
మరోవైపు కమల్‌ను ఓడించిన వానతి శ్రీనివాసన్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.
We have won! Thank you Kovai South for your support & blessings. I bow down to my voters, to my leaders, PM @narendramodi ji, HM @AmitShah ji, Nat'l President @JPNadda ji, GS(O) @blsanthosh ji & all @BJP4TamilNadu karyakarta for their hard work & dedication.#KovaiSouth4Vanathi
— Vanathi Srinivasan (@VanathiBJP) May 2, 2021
వానతి శ్రీనివాసన్‌కు బీజేపీ శ్రేణులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.
Be the first to comment