
హైదరాబాద్: కోవిడ్ వేళ చిన్నారుల కోసం వారధి జీవన్ ఆధ్వర్యంలో సంస్కార వారధి పేరుతో ఆన్లైన్ సమ్మర్ క్యాంప్‌లు విజయవంతంగా నడుపుతున్నారు. విద్యావేత్త నంది శ్రీనివాస్, యువ వ్యాపారవేత్త, ట్రైనర్ వై రమేశ్ సారధ్యంలో ఈ వేసవి శిబిరాలు పిల్లలకు ఉపయుక్తంగా ఉంటున్నాయి. కోవిడ్ కారణంగా పాఠశాలలు మూసి వేసిన తరుణంలో చిన్నారుల హృదయాల్లో సంస్కార భావాలు పురికొల్పేలా చేసేందుకు వారధి జీవన్ నడుం కట్టింది.
https://www.facebook.com/ramesh.yedella/posts/4046483082094505
శారీరకంగా, బలంగా… మానసికంగా దృఢంగా, పోటీ ప్రపంచానికి ధీటుగా పిల్లలు ఎదగాలనే లక్ష్యంతో ఆన్లైన్ సమ్మర్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. మానవీయ విలువలతో విలువైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశ్యంతో ఆ విలువలను ఒక కోర్సు గా అందించే ప్రయత్నమే సంస్కార వారధి 10 రోజుల శిక్షణా కార్యక్రమమని నిర్వాహకులు చెప్పారు. ఈ నెల 9 నుంచి 18 వరకు 10 రోజుల పాటు చిన్నారులకు నైతిక శిక్షణ అందించామన్నారు.
ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి 12.30 వరకు ZOOM ద్వారా ఈ ఆన్లైన్ తరగతులు నిర్వహించామన్నారు
10రోజుల శిక్షణలో బోధనాంశాలు ఇవే!
#మంచి అలవాట్లు
#శ్లోకాలు/పద్యాలు
#కథలు
#వ్యక్తిత్వ వికాస గీతాలు
#స్థితప్రజ్ఞత (భగవద్గీత)
#సూక్తులు విశ్లేషణ
#శాంతిపాఠం
విద్యార్ధులకు మంచి అలవాట్లతో పాటు, శాంతి పాఠం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సముద్రాల నరసింహాచారి బోధిస్తున్నారు. రామకృష్ణ మఠంతో చాలాకాలంగా అనుబంధం ఉన్న నిజామాబాద్ ఆకాశవాణి అనౌన్సర్ సముద్రాల మాధురి చిన్నారులకు నీతి కథలు చెబుతున్నారు. స్వామి వివేకానంద జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను కూడా ఆమె కథలుగా చెబుతున్నారు.
శ్లోకాలు/పద్యాలు, వ్యక్తిత్వ వికాస గీతాలు స్వయంగా నంది శ్రీనివాస్ నేర్పిస్తున్నారు.
భగవద్గీతకు సంబంధించిన శ్లోకాలను, ఇతర అంశాలను శ్రీదేవి నేర్పిస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫసర్ డాక్టర్ కె. లావణ్య, అవధూత శ్రీనివాస్ తదితర విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు కూడా కార్యక్రమాల నిర్వహణలో పాల్గొంటూ క్యాంప్‌ను సూపర్‌హిట్ చేశారు.
మొదటి క్యాంప్‌లో భాగంగా విద్యార్ధులకు ఎందరో స్ఫూర్తిదాయక వ్యక్తులను నంది శ్రీనివాస్ పరిచయం చేశారు. వీరిలో కామెడీ ట్రెండ్ సెట్టర్ సదానంద్(వీ6 ఫేం) ఉన్నారు. సదా చిన్నారులతో కూడా ముచ్చటించి వారిలో ఉత్సాహం నింపారు.
పాటలపూదోట మాట్ల తిరుపతిని నంది శ్రీనివాస్ చిన్నారులకు పరిచయం చేశారు. ఆయన తన ఆట-పాటలతో విద్యార్ధుల్లో జోష్ నింపారు.
కథ, నవలా రచయితగానే కాకుండా సినిమాలకు కథలు, మాటలు, పాటలు రాస్తూ సినిమా రచయితగా రాణిస్తున్న పెద్దింటి అశోక్ కుమార్‌ను నంది శ్రీనివాస్ చిన్నారులకు పరిచయం చేశారు. పెద్దింటి అశోక్ కుమార్ చిన్నారుల్లో స్ఫూర్తి నింపారు.
విద్యార్ధులతోటే కాకుండా వారి తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా ముచ్చటించడం ఈ క్యాంప్‌లో ప్రత్యేకతను సంతరించుకుంది.
మొదటి క్యాంప్ సూపర్ హిట్ కావడంతో మే 25 నుంచి పది రోజుల పాటు మరో క్యాంప్ నిర్వహిస్తున్నామని నంది శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే వందలాది మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆసక్తి కలవారు రిజిస్ట్రేషన్‌తో పాటు మరిన్ని వివరాలకు 8885816699
8885826699 నెంబర్ల ద్వారా సంప్రదించాలని నంది శ్రీనివాస్ సూచించారు. కోవిడ్ వేళ పాఠశాలలకు దూరమై ఇబ్బందుల్లో ఉన్న విద్యార్ధుల్లో మంచి అలవాట్లు, సంస్కారాలు నింపుతున్న వారధి జీవన్ నిర్వాహకులపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. నంది శ్రీనివాస్ బృందాన్ని అందరూ అభినందిస్తున్నారు.
Be the first to comment