
కొత్తగూడెం: కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్ లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు ఆహారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కొత్తగూడెం యూ.జె డిజైనర్స్ సంస్థ నిర్వాహకురాలు ఉమా జెర్రిపోతుల. అమెరికాలో ఉంటున్నా స్వదేశంలో పుట్టిన ఊరిలో కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు ఉమ ముందుకొచ్చారు. కొత్తగూడెం వీధుల్లోనూ, డివైడర్ల వద్ద తలదాచుకునే అభాగ్యులకు రోజూ వంద మందికి ఆహారం పొట్లాలు పంపిణీ చేయిస్తున్నారు. యూజే డిజైనర్ టీమ్ సభ్యులు ఆటో ద్వారా కొత్తగూడెం విద్యానగర్ కాలనీతో పాటు రామవరం, కొత్తగూడెం సూపర్ బజార్, బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి మర్గంలో పేదలకు ఆహారం పొట్లాలు పంచుతున్నారు.
మొత్తం పది రోజుల పాటు పేదలకు ఆహారం అందించాలని ఉమ నిర్ణయించుకున్నారు. అమెరికాలో ఉంటూ కూడా కొత్తగూడెంలో నిరుపేదల ఆకలి తీరుస్తున్న ఉమపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.
Be the first to comment