కోవిడ్ వేళ తెలంగాణ వాసులకు సేవాభారతి కొండంత అండ

సంక్షోభ సమయంలో పేదలకు వరంగా మారిన సేవాభారతి

హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో సేవా భారతి తెలంగాణలోని పేద ప్రజలకు వరంలా మారింది. హైదరాబాద్ నగర శివార్లలోని అన్నోజిగూడలో కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ ప్రారంభించి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. 200 పడకల ఈ కేంద్రంలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, యోగా సిబ్బంది కోవిడ్ పేషంట్లకు సేవలందిస్తున్నారు. ఈ కేంద్రంలో ఇప్పటికే వందలాది మంది చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అంతేకాదు కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా తీర్చేందుకు సలహా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సలహా కేంద్రంలో వైద్యులు ఆన్‌లైన్ ద్వారా సలహాలందిస్తారు. ప్రతిరోజూ వేలాది మంది ఫోన్ చేసి తమ సందేహాలు తీర్చుకుంటున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి పదిలోగా 040-48213100 నెంబర్‌కు ఫోన్ చేసి కోవిడ్ చికిత్సపై వైద్యుల సలహాలు తీసుకోవచ్చుని సేవా భారతి ప్రతినిధులు తెలిపారు.

కోవిడ్ స్వల్ప లక్షణాలు కలిగి ఉండి అన్నోజిగూడ ఉచిత కోవిడ్ ఐసొలేషన్ సెంటర్‌లో అడ్మిట్ కావాలనుకునేవారు ముందుగా 040-48212529 నెంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు సూచిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*