లాక్డౌన్ తర్వాతే “దక్ష ” ఫైనల్ షెడ్యూల్ షూటింగ్

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా “దక్ష”. వివేకానంద విక్రాంత్ తొలిసారి దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్న ఈ సినిమా లోసీనియర్ నటుడు శరత్ బాబు కుటుంబం నుండి ఆయుష్ హీరో గా పరిచయం అవుతున్నాడు.అరకు, ఖమ్మం, హైదరాబాద్ లలో మూడు షెడ్యూలు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ లాక్డౌన్ తర్వాతే ఉంటుందని అన్నారు.

 

డైరెక్టర్ వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ థ్రిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమా 70% షూటింగ్ పూర్తి చేసుకుంది.ప్రస్తుతం కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్స్ అన్ని నిలిపివేసాం,లాక్డౌన్ అయ్యాక, టీం అందరం వ్యాక్సిన్స్ వేసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని మరల షూటింగ్ నిర్వహిస్తాం అని అన్నారు.

తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజుకో వార్త చూస్తున్నాం, అత్యవసర పరిస్థితిలో మాత్రమే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని బయటకి వెళ్ళిరావాలి అని కోరుతున్నాను, అలానే మా సినిమా విషయానికి వస్తే వివేకానంద విక్రాంత్ ఎంచుకున్న కథ టెక్నీకల్ గా చాలా విభిన్నంగా ఉంటుంది, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమా ని థియేటర్లోనే విడుదల చేస్తాం.ఇలాంటి సినిమాలు థియేటర్ లొనే చూస్తే ఫీల్ బాగుంటుంది అని మా అభిప్రాయం.ఆయుష్,నక్షత్ర, అను, రియా,అఖిల్,రవి రెడ్డి, శోభన్ బాబు,పవన్, ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కి కెమేరా:- శివ, శ్రీకాంత్,రచన- శివ కాకు, కథ-దర్శకత్వం – వివేకానంద విక్రాంత్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*