
కొత్తగూడెం: అమెరికాలోని యూజే బ్రాండ్స్ ఎంటర్ ప్రెన్యూర్ డిజైనర్ ఉమా జెర్రిపోతుల పుట్టిన ఊరిపై మమకారంతో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. కోవిడ్ వేళ కొత్తగూడెంలోని విద్యానగర్లో పేదలకు భోజన వసతి కల్పించారు. లాక్ డౌన్ కారణంగా పస్తులు ఉంటున్న నిరుపేదలకు, భిక్షాటన చేసే వారికి, పారిశుద్ధ్య కార్మికులకు, అనాథాశ్రయం పిల్లలకు ఆహార పొట్లాలు అందించారు. అమెరికా నుంచి ఉమా జెర్రిపోతుల ఆర్ధికసాయం అందించారు. స్థానికంగా రిటైర్డ్ పోలీస్ అధికారి బీడీ గుప్త, యూజే డిజైనర్ సిబ్బంది కల్యాణ్, జీవన్ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. రోజూ ఆటోలో ఆహార పదార్థాలను తీసుకు వెళ్లి పంపిణీ చేశారు. రోజుకు 100 మందికి చొప్పున 10 రోజుల పాటు భోజనాలు ఏర్పాటు చేశారు. ఉమా జెర్రిపోతుల సేవాభావాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.
Be the first to comment