
హైదరాబాద్, రాంచి: పుస్తక ప్రియులకు శుభవార్త. ఆత్మసాక్షాత్కారం కోసం తపించే నిజమైన సాధకులను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత శిఖరాలకు తీసుకుపోయిన ప్రేమావతార్ పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సువర్ణావకాశం వచ్చేసింది.
https://www.facebook.com/AutobiographyParamahansaYogananda/posts/10158922824646293
ప్రపంచంలోని వంద అత్యుత్తమ పుస్తకాల్లో ఒక్కటైన ఒక యోగి ఆత్మకథ ఎందరో స్ఫూర్తి పొందారు. తమ జీవితాలను ఉద్ధరించుకున్నారు. ఇది కేవలం పుస్తకం మాత్రం కాదని చదివినవారికి అర్ధమౌతుంది. ప్రపంచానికి ఆధ్యాత్మికత అనే వరాన్ని అందించిన భారత్ గురించి, భారతీయ మునులు, రుషులు, యోగుల గురించి స్వయంగా ఒక యోగి రాయడం గొప్ప విషయం. పాఠకులను కట్టిపడేసే శక్తి ఈ పుస్తకానికి ఉందని అనేక మీడియా సంస్థలు ప్రకటించాయి కూడా. ధ్యానానికి సంబంధించి, ముఖ్యంగా క్రియా యోగ సాధన గురించి పరమ గురువులైన మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయ్జీ, యుక్తేశ్వర్ గిరీజీ తదితరుల గురించి ఈ పుస్తకంలో వివరించారు. అత్యంత శక్తిమంతమైన ధ్యాన ప్రక్రియ అయిన క్రియా యోగం గురించి ఈ పుస్తకంలో వివరించడం నిజమైన సాధకులకు వరం. పుస్తకం చదవడంతో ఆగిపోకుండా పరమహంస యోగానంద స్థాపించిన యోగొదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా క్రియాయోగ దీక్ష తీసుకుని ఆత్మ సాక్షాత్కారం కోసం యత్నించాలని సాధకులకు ఈ క్షణం టీం సూచిస్తోంది.
Be the first to comment