కరోనా థర్డ్ వేవ్ ముప్పు ముందర.. వీధి అరుగు వినూత్న కార్యక్రమం

సింగపూర్: భారతీయ వైద్య రంగంలో తన అనుభావాలు పంచుకోవడానికి శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డి జులై 25వ తేదీన వీధి అరుగు నిర్వహించే ఆన్‌లైన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో కళారత్న, ఆంధ్రప్రదేశ్ హంస పురస్కార గ్రహీత, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. జి.వి. పూర్ణచంద్ విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు. భారతదేశంలో బయో ఫార్మారంగం ఎలా అభివృద్ధి చెందింది? ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, టెక్నోక్రాట్లకు ఎలాంటి విధానాలతో ముందుకు వెళ్ళాలి? ఆధునిక జీవితంలో మన ఆయుర్వేదం పాత్ర ఏమిటి? మానవుడు దైనందిక జీవితంలో ఎటువంటి కట్టుబాట్లు-నియమాలను పాటించాలి? కరోనాను అంతమొందించేందుకు ఆయుర్వేదం ఎలా ఉపయోగపడుతుంది ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవచ్చని వేదిక నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనంటూ సోషల్ మీడియా ద్వారా కరపత్రాలను విడుదల చేశారు.

https://www.facebook.com/VeediArugu/posts/194080339355678

నాలుగు తెలుగు మాటలు చెప్పుకునేందుకు ‘వీధి అరుగు’ వేదికగా ఉన్న విషయం తెలిసిందే. నెదర్లాండ్స్‌లో నివసిస్తున్న గాయకుడు కార్తీక్ మద్దెల పాటతో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు కింది లింక్‌లో ఇచ్చిన గూగుల్ ఫాం నింపడంతో పాటు తమ ప్రశ్నలను లింక్ ద్వారా తెలియపరచవచ్చని నిర్వాహకులు తెలిపారు.

https://tinyurl.com/VeedhiArugu

పల్లె జీవనముతో పరిచయం అయిన ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో విడదీయలేనంతగా పెనవేసుకున్న ఒక మధురమయన అనుభూతి వీధి అరుగు!!

పిచ్చాపాటి కాలక్షేపాల దగ్గర నుంచి, ప్రంపచ సమస్యల వరకు..ఖగోళ శాస్త్రం నుంచి మూఢ నమ్మకాల వరకు అన్నిటి పరిష్కారవేదిక వీధి అరుగు!!

బుర్రకధలు, తోలుబొమ్మలాటలు, సాంఘీకనాటకాలు ప్రదర్శింపబడే ఒక కళావేదిక మన వీధి అరుగు!!

మానవాళి అభివ్రుద్దికి విజ్ఞాన వినోదాలు ఎంతో అవసరం. వాటికి దివ్యవేదిక మన వీధి అరుగు..

మారుతున్న పరిస్థితులలో, ఎంతో సమాచారం సాంఘికప్రసారమాధ్యమాలు ద్వారా అందుబాటులో ఉన్నా, పరిపూర్ణమైన సమాచారం తెలుసుకోవటం కొంచెం కష్టతరమైన విషయం.అందునా ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోవటం ఇంకా కష్టం. అటువంటి అడ్డంకులు తొలిగించేదుకు నిష్ణాతులైన వ్యక్తుల తో సమాచారాన్ని నేరుగా మీకు అందించడమే కాకుండా, ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష, సంస్కృతి లో ఉన్న ఔన్నత్యం కాపాడుకోవాలనే చిరు ప్రయత్నమే ఈ మన “వీధి అరుగు”.

https://www.youtube.com/channel/UC0JVCo_HfHRy0BTnvwsYIoA

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*