
చండీఘర్: హర్యానాలో జరుగుతున్న విశ్వహిందూ పరిషత్ అఖిల భారత సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర సంఘటనా మంత్రిగా ముడుపు యాదిరెడ్డిని ప్రకటించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ విభాగ్ ప్రచారక్ బాధ్యతల్లో ఉన్న ఆయన ఇకపై తెలంగాణ రాష్ట్ర సంఘటనా మంత్రిగా వ్యవహరిస్తారు. ఇక ఉత్తర, దక్షిణ ఏపీ రాష్ట్ర సంఘటనా మంత్రిగా ఏపీకి చెందిన శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
విశ్వహిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా రవీంద్ర నారాయణ్ సింగ్‌ను ఎంపిక చేశారు. బీహార్‌కు చెందిన రవీంద్ర నారాయణ్ సింగ్ ఇప్పటి వరకూ వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ అయిన ఆయన.. మెడికల్ సైన్స్ రంగంలో అందించిన సేవలకు 2010లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకొన్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే తిరిగి అదే బాధ్యతల్లో కొనసాగనున్నారు.
Be the first to comment