
.వర్షాకాలం సంబంధిత సమస్యలను ఎదుర్కోవడానికి సమగ్ర ప్రణాళిక రూపకల్పన
దక్షిణ మధ్య రైల్వే తన ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వర్షాకాలం సందర్భంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన పలు ప్రాంతాలను (వంతెనలతో సహా) గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి జోన్ సంసిద్ధమయ్యింది. వర్షాకాల సంబంధిత సమస్యలను సమర్థంగా ఎదుర్కొని తగిన చర్యలు తీసుకోవడానికి జోన్ తన పరిధిలోని అన్ని డివిజన్లలో సమగ్ర ప్రణాళికను రూపొందించింది. చేపట్టాల్సిన రైళ్ల నిర్వహణ మరియు మౌలిక సదుపాయాల కల్పన వంటి విభిన్న విభాగాలలోని వివిధ బృందాలను భాగస్వామ్యం చేస్తూ వారి సమాచారం మేరకు ప్రణాళికలు రూపొందించబడినాయి.
వర్షాకాలం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే చేపట్టే ముందు జాగ్రత్త చర్యలు ఈ క్రింది అంశాలలో ప్రతిపాదించబడినవి:
1. వర్షాకాలంలో ట్రాకుల పెట్రోలింగ్ మరియు చెరువులు, గుంటలు/వంతెనల వద్ద కాపలాదారు ఏర్పాటు : గుర్తించిన బ్లాక్ సెక్షన్లలో వర్షాకాలంలో పెట్రోలింగ్ మరియు చెరువులు, గుంటలు, వంతెనల వద్ద పరిస్థితుల అంచనాకు తగిన విధంగా కాపలాదారు ఏర్పాటు. ఈ సమయంలో ఏదేని సెక్షన్లో అసాధారణ వర్షపాతం లేదా తుఫాను నమోదయిన సందర్భంలో వాతావరణం తిరిగి సాధారణ స్థితికి చేరుకునేంత వరకూ పెట్రోలింగ్ నిర్వహించేలా ఏర్పాటు.
2. ట్రాక్‌పై చెరువుల ప్రభావం : జోన్లో రైల్వే మార్గాన్ని ప్రభావితం చేసే సుమారు 1900 చెరువులు, గుంటలు రైల్వేచే గుర్తించబడి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వాటిపై సమీక్షించడం జరిగింది. చెరువుల పరిస్థితి మరియు మరమ్మతులపై రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో రాష్ట్ర స్థాయి సమావేశాల నిర్వహణ. వర్షాకాలంలో చెరువుల, గుంటల తాజా స్థితిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించడం.
3. రిజర్వాయర్లు మరియు డ్యాముల వద్ద నీటి స్థాయి : రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమన్వయంతో డ్యాములు మరియు రిజర్వాయర్ల పరిధిలో ఉన్న రైల్వే వంతెనలను సూక్ష్మంగా పరిశీలించేంలా ఏర్పాటు. దీంతో మిగులు జలాలను విడుదల చేసినప్పుడు రైల్వే సమయానుకూలంగా తగిన చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి.
4. వాతావరణ మరియు తుఫాను హెచ్చరిక సమాచారం : సంబంధిత వాతావరణ శాఖ నుండి వచ్చే వాతావరణ హెచ్చరికలు/తుఫాను సమాచారాన్ని సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ తగిన చర్యలు చేపట్టడం.
5. ఎనిమోమీటర్లు : గుర్తించిన వంతెనల సమీపంలోని స్టేషన్ల భవనాలపై 30 ఎనిమోమీటర్లను ఏర్పాటు చేశారు. దీంతో గాలి వేగాన్ని ఎప్పటికప్పుడూ అంచనా వేస్తూ రైళ్ల రవాణా క్రమబద్దీకరణకు తగిన చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి.
6. నీటి స్థాయి పర్యవేక్షణ : గుర్తించిన వంతెనలపై 12 ఆటోమేటెడ్ నీటిస్థాయి పర్యవేక్షణ పరికరాలను ఏర్పాటు చేయడంతో నిరంతరం అక్కడి నీటిస్థాయి విలువలు అందుబాటులో ఉంటాయి.
7. సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవడం : వర్షాకాలం అత్యవసర పరిస్థితులలో వరదలతో ఏవేని అనుకోని ఘటనలు సంభవించినా వాటిని ఎదుర్కోవడానికి డివిజన్లలో గుర్తించిన ప్రాంతాలలో స్టేషన్లు మరియు గూడ్స్ వ్యాగన్లలో ట్రాక్/వంతెనల పునరుద్ధరణకు అవసరమయ్యే సామగ్రిని సిద్ధం చేసుకోవడం.
Shri Gajanan Mallya, GM, SCR holds virtual #Safety review meeting during which #GeneralManager #MANOFTHEMONTHAWARDS were presented to the employees for absolute dedication & alertness while performing their duties, By respective DRM of the divisions @Secunderabad Division pic.twitter.com/HvI0Wwseym
— DRM Secunderabad (@drmsecunderabad) July 19, 2021
వర్షాకాలంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అత్యంత జాగ్రత్తలతో సిద్ధంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య జోన్‌లోని అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. భద్రతా చర్యలు చేపట్టడంలో క్రియాశీలకంగా ఉంటూ ‘‘భద్రతా చర్యలలో ఎటువంటి రాజీ లేకుండా’’ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆరు డివిజన్ల అధికారులను ఆదేశించారు. ఒక వేళ రైళ్లను క్రబమబద్ధీకరిస్తే లేదా రైళ్ల సర్వీసులకు ఆటంకాలు ఏర్పడితే ప్రయాణికుల రైళ్ల రవాణాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఆ సమాచారాన్ని వీలైనంత త్వరగా ప్రజలకు అందించాలని ఆయన అన్నారు.
This post is also available in : English
Be the first to comment