గురు పూర్ణిమ సందర్భంగా రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40% డిస్కౌంట్

హైదరాబాద్: గురు పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ ఉంటుంది. భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని రామకృష్ణ మఠం ప్రతినిధులు సూచించారు. మరోవైపు గురు పౌర్ణమి వేడుకలకు మఠంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.

గురుపూర్ణిమ సందర్భంగా ఈ నెల 24న ఉదయం 7 గంటలకు విశేష పూజ, ఉదయం 8 గంటలకు భజనలు, ఉదయం 10:45కు హోమం, 11:15కు తెలుగులో ప్రసంగం ఉంటాయి. ఉదయం 11:40కి ముండకోపనిషత్తు నూతన పుస్తక ఆవిష్కరణతో పాటు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 12:05 నిమిషాలకు విశేష హారతి, సాయంత్రం 6:45కు ఆరాత్రికం ఉంటాయి. రాత్రి 7:15 నిమిషాలకు ప్రత్యేక భజనలుంటాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*