
హైదరాబాద్: మెహిదీపట్నంలోని సరోజిని దేవి కంటి ఆసుపత్రి సివిల్ సర్జన్, ఆర్ఎంఓ డాక్టర్ నజాఫి బేగమ్‌కు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డ్ లభించింది. వైద్యరంగానికి ఆమె అందించిన సేవలకు గాను హైటెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును బహుకరించారు. డాక్టర్ నజాఫి బేగమ్ 29 సంవత్సరాలుగా వైద్య సేవలందిస్తున్నారు.
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 29 ఏళ్ల క్రితం మొదలైన ఆమె సేవా కార్యక్రమాలు కొన్నేళ్లుగా సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో కొనసాగుతున్నాయి. పేద ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారని ఆమె పేరు తెచ్చుకున్నారు. డాక్టర్ నజాఫి బేగమ్‌కు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డ్ లభించడంపై ఆమె కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Be the first to comment