సచివాలయ ఉద్యోగుల్లో అయోమయం గందరగోళం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు కంగారు పడుతున్నారు. సడెన్‌గా డిపార్ట్‌మెంట్ టెస్టులు అంటే ఎలా అని ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే తాజాగా APPSCకి, పలు లైన్ డిపార్ట్‌మెంట్లకు ప్రభుత్వ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ అజైన్ జైన్ లేఖ రాశారు. అందులో పలువురు సచివాలయ ఉద్యోగులకు త్వరగా డిపార్ట్‌మెంట్ టెస్టులు నిర్వహించాలని, ఒక టైం టేబుల్‌ను ప్రకటిస్తూ కార్యాచరణను సూచించారు. ఆ లేఖ ప్రకారం ఆగష్టు 10 నుంచి అక్టోబర్ 2 వరకు కార్యాచరణ ఉంది.

అయితే ప్రొబేషన్ డిక్లేర్ చేయడం కోసం ఇంత సడెన్‌గా నిర్ణయం తీసుకోవడం వల్ల తాము నష్టపోతామని సచివాలయ ఉద్యోగులు కంగారు పడుతున్నారు. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో గ్రేడ్-5 సెక్రెటరీ, డిజిటల్ అసిస్టెంట్ వంటి వారు ఆల్రెడీ డిపార్ట్‌మెంట్ టెస్టులు రాసేసి సేఫ్ సైడ్‌లో ఉన్నారని, తమకు మాత్రం తక్కువ టైం ఉందని అంటున్నారు. ఇదే నిర్ణయం మొదట్లోనే తీసుకుని ఉండి ఉంటే చాలా బాగుండేదని ఆవేదన చెందుతున్నారు.

అజయ్ జైన్ సూచించిన కార్యాచరణ
ఆగష్టు 10: సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించేందుకు సరైన పరీక్షా విధానాలను ఆయా లైన్ డిపార్ట్‌మెంట్ వారు ఎంపిక చేయాలి.
ఆగష్టు 15: డిపార్ట్‌మెంటల్ టెస్టులను జత చేస్తూ హోం డిపార్ట్‌మెంట్ సర్వీస్ రూల్స్‌లో సవరణ చేయాలి.
ఆగష్టు 20: సిలబస్‌ను APPSCకి తెలియజేయాలి.
సెప్టెంబర్ 15: APPSC ద్వారా పరీక్షలు నిర్వహించాలి.
సెప్టెంబర్ 22: పరీక్షా ఫలితాలను ప్రకటించాలి.
అక్టోబర్ 2: అర్హులకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ప్రకటన చేయాలి.

గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగులు పని చేస్తున్నారు. అయితే అందులో 8 మందికి మాత్రం వారి సొంత డిపార్ట్‌మెంట్‌ల సర్వీస్ రూల్స్ ప్రకారం ఎలాంటి డిపార్ట్‌మెంట్ టెస్టులు లేవు. ఈ కారణంగానే పై విధంగా నిర్ణయం తీసుకున్నారు.

ఆ ఎనిమిది మంది ఎవరంటే..
1) వెల్ఫేర్ అసిస్టెంట్
2) ఇంజనీరింగ్ అసిస్టెంట్
3) మహిళా పోలీస్
4) ANM
5) VRO
6) యానిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్
7) ఫిషరీస్ అసిస్టెంట్
8) సెరీకల్చర్ అసిస్టెంట్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*