హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాసయాదవ్

హైదరాబాద్: హుజూరాబాద్ TRS అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాసయాదవ్‌ను టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖరరావు ప్రకటించారు.  ప్రస్తుతం టీఆర్ఎస్‌వీ అధ్యక్షుడిగా ఉన్న గెల్లు శ్రీనివాసయాదవ్ ఎంఏ ఎల్ఎల్‌బీ చదివారు. రాజనీతి శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన శ్రీనివాసయాదవ్‌ను హుజూరాబాద్ అభ్యర్ధిగా ప్రకటించడం ద్వారా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

 

గెల్లు శ్రీనివాసయాదవ్ బయోడాటా

…………………………………………

పేరు: గెల్లు శ్రీనివాసయాదవ్
తండ్రి పేరు: గెల్లు మల్లయ్య (మాజీ.MPTC, కొండపాక)
తల్లి పేరు: లక్ష్మి (మాజీ సర్పంచ్, హిమ్మత్ నగర్)
పుట్టినతేది: 21-08-1983
విద్యార్హతలు: ఎం ఏ, ఎల్ ఎల్ బి.
పరిశోధక విద్యార్థి (రాజనీతి శాస్త్రం)
సామాజిక వర్గం: బి.సి. (యాదవ్)
నివాస స్థలం: హిమ్మత్ నగర్ (గ్రామం),
వీణవంక (మండలం)
కరీంనగర్ (జిల్లా)
కార్యనిర్వాహక సంస్థ: రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ
రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం
(TRSV) టిఆరెస్ అనుబందం

పరిచయం:

గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ది గ్రామీణ నేపథ్యం. తండ్రి గెల్లు మల్లయ్య స్థానిక మండల స్థాయి లో 1985 నుంచి తెలుగుదేశం పార్టీలో చాలా చురుకైన పాత్ర పోషించారు. గెల్లు మల్లయ్య అఖిల భారత యాదవ మహాసభ కన్వీనర్ (2000-2005)గా, కొండపాక ఎంపీటీసీ (2001-2005)గా టీఆరెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గా పనిచేశారు. టీఆరెస్ పార్టీ లో మండల స్థాయి లో 2004 నుండి నేటి వరకు పనిచేస్తున్నారు. జిల్లా యాదవ సహకార సంస్థ డైరెక్టర్, (పశుసంవర్థక శాఖ, ఆంధ్రప్రదేశ్) గా ఎన్నుకోబడ్డారు. ప్రస్తుతం PACS డైరెక్టర్ గా మరియు రైతు బంధు సమితి కోఆర్డినేటర్ (కొండపాక)గా పనిచేస్తన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ తల్లి హిమ్మత్ నగర్ గ్రామ సర్పంచ్ (టీఆరెస్ పార్టీ) గా సేవలందించారు.

తెలంగాణ ఉద్యమంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాత్ర:

*డిగ్రీ (బి.ఏ)చదువుతున్న కాలం నుంచే విద్యార్థి రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు. హైదరాబాద్ లోని అంబర్ పెట్ లోని ప్రభుత్వ బిసి హాస్టల్ లో ఉంటూ అధ్యక్షుడు (2003-2006)గా ఎన్నికై బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడారు. *A.V కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో కెసిఆర్ గారి నేతృత్వంలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమానికి, కెసిఆర్ గారి ప్రసంగాలకు ఆకర్షితుడై క్రియాశీలకంగా ఉదయమకాలం నుండి నేటి వరకు అదే ఉత్సాహంగా టీఆరెస్ పార్టీ లో నిబద్ధతతో పనిచేశారు.

*2003-2006 TRSV అధ్యక్షులు, A. V. కాలేజీ, హైదరాబాద్, గా ఉన్నప్పుడు విద్యార్థుల ఫీజు పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని నడిపి అరెస్ట్ అయ్యారు.చివరకు కాలేజ్ యాజమాన్యం ద్వారా ఫీజు రిఇంబెర్స్ మెంటు సాధించడం లో విజయం సాదించారు.

*2003-2006 లో TRSV హైదరాబాద్ పట్టణ కార్యదర్శి గా బొమ్మర రామ్మూర్తి మరియు బాబా ఫసియుద్దీన్ నాయకత్వం లో పనిచేశారు.

*2003-2004 విద్య సంవత్సరం లో బిసి విద్యార్థుల ఫీజు రీఇంబర్స్ మెంటు కోసం ఇందిరా పార్కు లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా లు నిర్వహించారు.

*2004 డిసెంబర్ లో విద్యార్థుల స్కాలర్ షిప్ మరియు ఫీజు రియింబర్స్ మెంటు మోతాన్ని పెంచాలని ఆర్థిక మంత్రి రోశయ్య ఇళ్ళు ముట్టడి కి ధర్నా నిర్వహించి అరెస్టు అయ్యారు.

*2006-2007 లో హైదరాబాద్ లోని తెలుగు యూనివర్సిటీ, TRSV అధ్యక్షుడు గా, TRSV రాష్ట్ర అధ్యక్షుడు బొంతు రామ్మోహన్  నాయకత్వం లో నియమితులై పనిచేశారు.

*సెప్టెంబర్ 19, 2006 న సోమజి గూడ ప్రెస్ క్లబ్ లో లగడపాటి రాజగోపాల్ కు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు జరిపిన నిరసన ర్యాలీ లో అరెస్ట్ అయ్యారు.

*2006 లో కెసిఆర్ గారు కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నందుకు మద్దతు గా బావన్స్ కాలేజీ విద్యార్థుల తో నారాయణ గూడ లో భారీ ఎత్తున ధర్నా నిర్వహించి కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మలను తగలపెట్టారు.

*2006 సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోక్ సభ ఉపఎన్నికలలో స్టూడెంట్ ఇంచార్జి గా హరీష్ రావు గారి నాయకత్వం లో పనిచేశారు.

*2008, స్టూడెంట్ ఇంచార్జి గా జడ్చేర్ల నియోజకవర్గ ఉపఎన్నికలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రెడ్డి నాయకత్వం లో పని చేసారు.

*టిఆరేస్వి రాష్ట్ర కార్యదర్శి (2008)గా ఎర్రోళ్ళ శ్రీనివాస్ నాయకత్వం లో పనిచేశారు.

*2009 సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ నాయకత్వం లో క్రియాశీలకంగా పనిచేశారు. *2009 లో కెసిఆర్ అరెస్ట్ ను నిరసిస్తూ, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు.

*2010 లో ఉస్మానియా యూనివర్సిటీ TRSV అధ్యక్షుడు గా బాల్క సుమన్ ద్వారా నియమించబడ్డారు.

*జనవరి 18, 2010 న “తెలంగాణ విద్యార్థి మహా పాదయాత్ర” ప్రారంభించి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి 650 కి.మీ. పాదయాత్ర చేసి వేల మంది విద్యార్థులను యువకులను పాదయాత్రలో,తెలంగాణ ఉద్యమం లో భాగస్వాములను చేయడం లో విజయం సాధించారు.

*2010 హుజురాబాద్ ఉప ఎన్నిక లో స్టూడెంట్ ఇంచార్జి గా బస్సు యాత్ర (ప్రజా చైతన్య యాత్ర)లో పనిచేశారు.

*2011, మార్చి 1న, మౌలాలి రైల్వే స్టేషన్లలో 48 గంటల రైల్ రొఖో ప్రోగ్రాం ను వందలాది విద్యార్థులతో కలిసి KTR నాయకత్వం లో విజయవంతం చేశారు.

*2011, మార్చి 10న, TRSV ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు గా తెలంగాణ జెఏసి పిలుపు మేరకు చారిత్రక “మిలియన్ మార్చ్ ప్రోగ్రాం”లో భారీ ర్యాలీ నిర్వహించారు.

*2011,జులై 21 న యాదిరెడ్డి ఆత్మహత్యకు నిరసనగా బందుకు పిలుపునిచ్చి ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలంగాణ భవన్ కు భారీ ర్యాలీ నిర్వహించారు. సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి చంచల్ గూడ జైల్లో బంధించారు.

*2011, నవంబర్ 1న, ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి గన్ పార్క్ వరుకు “చలో గన్ పార్క్” ప్రోగ్రాం కు వందలాది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

2011,నవంబర్ 16-22 వరకు KTR  నాయకత్వంలో జరిగిన “వికారాబాద్ -కుత్బుల్లాపూర్ చౌరస్తా పాదయాత్ర”లో పాల్గొన్నారు.

*2011 నవంబర్ ఉదయం 6గం. లకు తార్నాక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద “చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లా పాలకుర్తి లో జరిపే రైతు యాత్ర” కు నిరసనగా వందలాది విద్యార్థులను సమీకరించి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మీద రాళ్లు విసిరారు. ఈ ఘటనలో పోలీసులు అరెస్టు చేసి 20 రోజులు చర్లపల్లి జైలులో నిర్బంచారు.

*2012, మార్చి, స్టూడెంట్ ఇంచార్జి గా కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే నాయకత్వంలో కొల్లాపూర్ ఉపఎన్నికలో శ్రీ.జూపల్లి కృష్ణారావు గెలుపుకై పని చేసారు.

*2012, సెప్టెంబర్ 30 న, కె.టి.రామారావు (MLA) నాయకత్వంలో ‘సాగర హారం ప్రోగ్రాం’ కు వందలాది ఉస్మానియా విద్యార్థులతో మహా ర్యాలీ నిర్వహించారు. 14F క్లాజ్ ను తొలగించాలని ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేసారు.

*2012, గెల్లు శ్రీనివాస్ యాదవ్ నాయకత్వం లో “చలో సెక్రటేరియట్” ప్రోగ్రాం తో భారీ ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుండి సెక్రటేరియట్ వరకు తెలంగాణ ఎంప్లాయిస్ “సకలజనుల సమ్మెకు” మద్దతుగా నిర్వహించారు.

*2013, సెప్టెంబర్ 7న, APNGO’s తలపెట్టిన “సేవ్ ఆంద్రప్రదేశ్” మీటింగ్ ను వ్యతిరేకిస్తూ LB స్టేడియం వద్ద అరెస్టు అయ్యారు.

*అనేక మంది విద్యార్థుల సామాజిక ఆర్థిక వ్యక్తిగత సమస్యల పట్ల యూజీసీ మరియు జాతీయ కమీటీ లకు రేప్రేజెన్టేషన్ ఇచ్చారు.

*2013,డిసెంబర్ లో హైదరాబాద్ లోని NCRI(National Council Of Rural Institutes) మానవ వనరుల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం లో ఫుల్ టైం చైర్మన్ మరియు పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ హైకోర్టు లో PIL (Public Intrest Litigation) వేశారు. ఫలితంగా AP హైకోర్టు, మానవ వనరుల మంత్రిత్వ శాఖ సెక్రెటరీ గారిని హైకోర్టు లో హాజరు కావాలని ఆర్డర్ చేయడం జరిగింది.

*2001 నుండి నేటి వరకు తెలంగాణ ఉద్యమం లో చురుగ్గా పాల్గొన్నారు. 100కు పైగా కేసులు నమోదయ్యాయి అనేక సార్లు పోలీసులు అరెస్టు చేశారు మరియు 2 సార్లు జైలుకు వెళ్లి 36 రోజులు చర్లపల్లి సెంట్రల్ జైల్ మరియు చంచల్ గూడ సెంట్రల్ జైల్ లో జైలు జీవితం గడిపారు.

*2017 నుండి TRS విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో పనిచేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*