పులిజాల కవిత్వం ( మధురమైన కథ)

విద్యార్థులకు ప్రియమైన మాస్టారు కిష్టయ్య

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎడ్యుకేషన్ లెక్చరర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా సమర్థుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు లెక్చరర్ కిష్టయ్య వేలాదిమంది డిఈడీ, బిఈడీ, టీపీటీ విద్యార్ధులు తెలుగు పండిట్లయ్యేందుకు కారణమయ్యారు. విద్యార్ధులను అమితంగా ప్రేమించి… వారు జీవితంలో స్థిరపడేందుకు అన్నివిధాలా సహకరించే మనస్తత్వం ఆయనది. గాయకుడు కూడా కావడంతో తరగతి గదుల్లో కిష్టయ్య సార్ జానపదాలను విద్యార్ధులు తెగ ఎంజాయ్ చేసేవారు. నిలువెల్లా మధురత్వాన్ని నింపుకున్న కిష్టయ్య సార్ క్లాసుల కోసం విద్యార్థులు ఉత్సాహంగా ఎదురుచూసేవారు. విద్యార్థులకు ప్రియమైన మాస్టారైన కిష్టయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిత్వం రాయడంలోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. కిష్టయ్య రాసిన కవిత్వాలు, రచనలు ఈక్షణం పాఠకులకు ప్రత్యేకం.

 

–మధురమైన కథ–

విధి వ్రాశాడొక వింతకథ
వినుటకు వింపుగ నున్న కథ
నాకూ నీకూ తెలిసిన కథ
మధురమైన ఒక ప్రేమ కథ! “విధి..’

కనుల భాషలు మనకే నేర్పి
నవ్వుల మధు వును మనకే పంచి
మనసుల పువ్వులు పూయించి
మధుర భావాలు కలిగించి ” విధి.. ‘

ప్రేమ సామ్రాజ్యం నిర్మించి
ఆ ఏలికల మనల గావించి
చరిత్రకందని గమనం లో
పవిత్రప్రేమ పయనం లో ” విధి.. ‘

నవ వసంతాల్ని కలిగించి
ఆశలు ఎన్నో కలిపించి
అను బందాలు లెన్నో పెంచి
మనసుకు మనిషిని వారధి చేసి
విధి వ్రాశాడొక వింతకథ …. ”

అనురాగము కౌగిలిలు నిచ్చి
అనుభూతుల ఊయలలుాపి
విడదీయరాని మనస్సుల కలిపి
ప్రేమ జీవుల రాజ్యం నిలిపి

విధి వ్రాశాడొక వింతకథ
వినుటకు వింపు నున్న కథ
నాకూ నీకూ తెలిసిన కథ
మధురమైన ఒక ప్రేమ కథ!

–తపస్వి (పులిజాల)

(92465 28339)

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*