జమున 85వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రముఖుల శుభాకాంక్షలు

సింగపూర్: ప్రజానటి కళాభారతి డాక్టర్ జమునా రమణారావు ఎనభై ఐదవ (85)వ జన్మదినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఐదు ఖండాలలోని 30 కళాసమితుల సహకారంతో వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, తెలుగు కళా సమితి ఖతార్ కలిసి ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు.

జమున నా అభిమాన నటి: పింగళి వెంకయ్య కుమార్తె

ఘంటసాల సీతామహాలక్ష్మీ ఆశీర్వదిస్తూ నేను జమున అభిమానిని. ఆరోజుల్లో జమున సినిమా వస్తుందంటే చాలు ఎదురు చూసి మరీ రాగానే వెళ్ళిపోయేదాన్ని. జమున గారి కట్టు బొట్టు ఎంత సంప్రదాయకంగా ఉండేవో అభినయం అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే నాకు నూరు సంవత్సరాల వయసులో జమున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే అవకాశం రావడం నిజంగా నాకు చాల సంతోషంగా ఉంది. అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి.

ఘంటసాల సీతామహాలక్ష్మీ వచ్చి తనను ఆశీర్వదిస్తుంటే స్వయంగా పింగళి వెంకయ్య గారే వచ్చి ఆశీర్వదించినంత ఆనందంగా ఉందని జమున అన్నారు.

దర్శకులు కె విశ్వనాధ్:

జమునా, నీకు 85వ పుట్టినరోజంటే నమ్మలేకుండా ఉన్నాం. ఇప్పుడే, నిన్నకాక మొన్న పెద్దమనిషివై నటనలో సత్యభామ లాగా ఇంకా మా కళ్ళ ముందర కనిపిస్తున్నావు. నీకు ఇంత తొందరగా వయస్సు వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది. నా శుభాకాంక్షలు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి. క్షేమంగా ఉండి, ఇంకా ఒక యాభై ఏళ్ళు హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను, సెలవు.

వంశీ రామరాజు మాట్లాడుతూ జమునకు డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో కనకాభిషేకం చెయ్యబోతున్నట్టు ఆ సందర్భంగా అమెరికా గాన కోకిల శారద ఆకునూరి మెగా సంగీత విభావరి సమర్పించనున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి (USA) జమునకు డాక్టర్ c నారాయణరెడ్డి  స్వర్ణ కంకణ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు.

పదహారు (16) గంటల సేపు జరిగిన ఈ కార్యక్రమంలో 30 దేశాల నించి 200 మందికి పైగా కవులు కళాకారులు పాల్గొని జమున నటించిన చిత్రాలలోని పాటలు ఎంచుకుని ఆట పాటలతో కార్యక్రమం ఆసాంతం రక్తి కట్టించారు. ఈ కార్యక్రమాన్ని తాతాజీ ఉసిరికల నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.వి.రమణ, మురళీమోహన్, మండలి బుద్ధప్రసాద్, డాక్టర్ కె. విశ్వనాధ్, కె.ఐ.వరప్రసాద్ రెడ్డి, డాక్టర్ ఏవి గురవా రెడ్డి, ఉపేంద్ర చివుకుల ( అమెరికా ), డాక్టర్ ఎం యెస్ రెడ్డి (అమెరికా), శారద ఆకునూరి ( అమెరికా ), డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి (అమెరికా), తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, మాధవపెద్ది సురేష్, భువనచంద్ర, డాక్టర్. కె.వి.కృష్ణ కుమారీ, దివ్యవాణి, తులసి, రోజా రమణి, డాక్టర్ చిట్టెం రాజు వంగూరి, లక్ష్మీ రాయవరపు ( కెనడా ), గుణసుందరి కొమ్మారెడ్డి ( అమెరికా), లలితారాం (అమెరికా), కల్యాణి కొండూరు (ఖతార్ ) శైలజ సుంకరపల్లి, డాక్టర్ తెన్నేటి సుధాదేవి, శ్రీదేవి జాగర్లమూడి ( అమెరికా), శారద కాశివజ్జల ( అమెరికా), లయన్ లక్ష్మీప్రసాద్ కపటపు, సుధీర్ కోట (అమెరికా), రాజేష్ ఎక్కలి ( అమెరికా) కె యెస్ ప్రసాద్ (ఖతార్), తాతాజీ ఉసిరికల (ఖతార్) రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), రాధిక మంగిపూడి ( సింగపూర్), సురేష్ కొండేటి, జయ పీసపాటి ( హాంగ్ కాంగ్), బీ . కృష్ణ కుమార్ ( ఖతార్), వి ఆర్ ఆర్ పద్మజ ( ఖతార్), రాజేష్ తోలేటి (యూ కె), జి వి ఎన్ నరసింహం , శ్రీలత మగతల (న్యూజిలాండ్), సారధి మోటమర్రి ( ఆస్ట్రేలియా), విజయ గొల్లపూడి ( ఆస్ట్రేలియా), డాక్టర్ వ్యాసకృష్ణ బూరుగుపల్లి (యుగాండా), రాపోలు సీతారామరాజు ( సౌత్ ఆఫ్రికా), విక్రమ్ (సౌత్ ఆఫ్రికా), డాక్టర్ వెంకటపతి ( నార్వే), అనిల్ కుమార్ కడించెర్ల (ఒమాన్), హరి వేణుగోపాల్ (ఒమాన్),
ఎం వి వి సత్యనారాయణ (ఖతార్),డి .సాయి సుబ్బారావు (కువైట్), వెంకటేశ్వరరావు (బోత్సువానా), సతీష్ (బోత్సువానా), పార్థసారథి (యుగాండా), సుందరగిరి శంకర గౌడ్ ( ఖతార్), రాధిక నోరి (అమెరికా), సత్యాదేవి మలుల్ల (మలేషియా), మరియు ఖతార్ తెలుగు కళాసమితి కార్యవర్గం పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని అమెరికా గాన కోకిల శారద ఆకునూరి ( అమెరికా), కల్యాణి కొండూరు (ఖతార్), సుజిత సైని (ఖతార్), దుర్గా భవాని (ఖతార్),గౌరీదేవి బొమ్మన (ఖతార్) మాధవి బైటారు (ఖతార్), వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమాన్ని trinet లైవ్ టీవీ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*